Sheikhpet robbery case : తల్లి డైరెక్షన్‌..కొడుకులు యాక్షన్‌.. షేక్​ పేట చోరీ కేసులో బిగ్‌ట్విస్ట్‌

హైదరాబాద్​  ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని డైమండ్స్‌ హిల్స్‌ కాలనీలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. చోరీలో32 తులాల బంగారం, రూ.4.5 లక్షల నగదు చోరీ జరిగింది. కాగా ఈ చోరీని పోలీసులు చేధించారు. లేడీ డాన్‌ సనాబేగం ఈ చోరీ చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు.

New Update
Sheikhpet robbery case

Sheikhpet robbery case

Sheikhpet robbery case : హైదరాబాద్​  ఫిలిం నగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డైమండ్స్‌ హిల్స్‌ కాలనీలో చోరీ జరిగిన విషయం తెలిసిందే.  చోరీలో32 తులాల బంగారం, రూ.4.5 లక్షల నగదు చోరీ జరిగింది. కాగా ఈ చోరీని పోలీసులు చేధించారు. లేడీ డాన్‌ సనాబేగం ఈ చోరీ చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. తన ముగ్గురు కొడుకులతో కలసి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.ఈ మేరకు 10 తులాల బంగారం విక్రయిస్తూ రెండో కొడుకు సాహాయిల్‌తో సహా సనా పట్టుబడింది. మిగిలిన ఇద్దరు కొడుకులు పరారీలో ఉన్నారు. కాగా సనాపై నగరంలో ఇప్పటికే 43 చోరీ కేసులున్నాయి. తల్లి సనా డైరెక్షన్‌లో కొడుకులు చోరీలకు తెగబడుతున్నారని పోలీసులు తెలిపారు.

Also Read: Minister Seethakka-Padi Koushik Reddy: తమ్ముడూ మా ఇంటికి భోజనానికి రండి అంటూ పాడి కౌశిక్‌ రెడ్డిని ఆహ్వానించిన సీతక్క!

కాగా ఫిలింనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని షేక్​ పేటలో ఓ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు.  డైమండ్​ హిల్స్​ లో తాళం వేసిన ఇంటిని దోచుకున్న దుండగులు.. 34 తులాల బంగారం.. రూ. 4.5 లక్షలు.. 550 కెనెడియన్​ డాలర్లు తస్కరించారు.  బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.  చోరీ జరిగిన ఇంటిని మొజాహిత్ అనే వ్యక్తికి సంబంధించినదిగా పోలీసులు తెలిపారు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రీడ ఏదో తెలుసా..?

చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు మొజాహిత్​ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. రంజాన్ మాసం కావడంతో  బంధువుల ఇంటికి వెళ్లాడు.  ఇదే అదునుగా భావించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు.  చోరీకి పాల్పడడమే కాకుండా.. సీసీ కెమెరాల్లో తమ వీడియోస్ కనిపించకుండా సీసీ కెమెరా హార్డ్ డిస్క్ తో సహా ఎత్తుకెళ్లిపోయారు దొంగలు. మోజాహిత్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. మొత్తం మీద అనుమానంతో సనా మీదా నిఘా పెట్టిన పోలీసులకు బంగారం అమ్ముతూ చిక్కింది.

Also Read: ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..పదేళ్ళల్లో జీడీపీ డబుల్

Also Read: 9 ఏళ్ల పిల్లాడిని వదిలి ప్రియుడితో తల్లి జంప్.. ఆ తర్వాత ఏమైందంటే?

Advertisment
Advertisment
Advertisment