TG Crime
TG Crime: ఆడపిల్లలపై దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. బయటి వ్యక్తులే కామందులా ఉన్నారంటే... ఇప్పుడు కన్నవాళ్లే రాబంధువులుగా మారారు. ఆడపిల్లకు పెద్దయ్యాక పెళ్లి, ఇతర ఖర్చులు ఎక్కువుగా ఉంటాయని ముందుగానే ఊహించి ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటి ఘటనపై తెలంగాణలో చోటు చేసుకుంది. రెండు రోజులు క్రితం హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధి ఐడీఏ బండ్లగూడలో 14 రోజులు పాపం చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు.
పాపం పసికందు:
ఇన్‌స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన ముదులై మణి, ఆరోగ్య విజ్జి(32) దంపతులు బండ్లగూడలో నివాసం ఉంటున్నారు. ఐడీఏ శాస్త్రిపురం అలీనగర్‌లోని ఓ కంపెనీలో కూలీలుగా చేస్తూ జీవనం కొసాగిస్తున్నారు. వీరికి ఏడాది బాబు ఉండగా, మరో పాపకు జన్మనిచ్చింది. అయితే.. భర్త ఆరోగ్యపరిస్థితి బాగోలేదని 14 రోజుల ఆడపిల్లను చంపేసింద తల్లి విజ్జి. ఆడపిల్ల పెద్దయ్యాక చదువు, పెళ్ళి, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయని ముందుగానే భావించి నీళ్ల బకెట్‌లో వేసింది. పోలీసుల కేసు నుంచి తప్పించుకోవడానికి.. గుర్తు తెలియని వ్యక్తులు నీళ్లలో పడేశారని నాటక మాడింది. చివరికి పోలీసు విచారణలో చేసిన తప్పు అంగీకరించింది ఆ కసాయి తల్లి.
ఇది కూడా చదవండి: ముఖంపై మచ్చలను తగ్గించడంలో ఈ ఆకులు బెస్ట్ మెడిసిన్
భర్త ముదులై మణికి ఆరు నెలల కిందట రెండు కిడ్నీలు పనిచేయడం లేదు. భర్త కిడ్నీ సమస్యతో మరణిస్తే మా పరిస్థితి ఏమిటని భావించింది. పిల్లల విషయంలో ఇతర ఖర్చులు ఒంటరి మహిళగా భరించలేమని పసిపిల్లను చంపేద్దామని నిర్ణయించుకుంది. ఇంట్లో భర్త లేని సమయం చూసి పాపను నీళ్ల బకెట్‌లో వేసింది. పాప చనిపోయాక అసలు నాటకం మొదలు పెట్టింది. పాప కనిపించడం లేదని ఇంటికి చుట్టుపక్కల వెతికింది. చివరికి బకెట్‌లో బిడ్డ మృతదేహం చూసి గట్టిగా కేకలు పెడుతూ విలపించింది. పాపను మంచం మీద పడుకోబెట్టి స్నానానికి వెళ్లగా.. ఎవరో వచ్చి నీళ్ల బకెట్‌లో పడేశారని మాయ మాటలు చెప్పింది. భర్తకు ఈ విషయాన్ని చెప్పి కన్నీరు మున్నీరైంది. తల్లి చెప్పే విషయానికి అక్కడి పరిస్థితులకు పొంతనలేదని పోలీసులు విచారణలో తెలింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నీళ్లలో పడేసినట్లు తల్లి ఒప్పకుంది. పోలీసులు తల్లిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఇది కూడా చదవండి: వేసవిలో ఈ ఆహారాలతో చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి
( ts-crime | ts-crime-news | telugu-news | latest-news)