/rtv/media/media_files/2025/04/07/BshW9WPS45XzeX3B6dxG.jpg)
Kalvakuntla Kavitha
MLC Kavitha : అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇందిరా పార్క్ వద్ద ఏర్పాట్లను సోమవారం నాడు తెలంగాణ జాగృతి నాయకులు నవీన్ ఆచారి, యూపీఎఫ్ కో కన్వీనర్ బొళ్ల శివ శంకర్ పరిశీలించారు.
Also read : ఏడడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపరాఫర్!
బీసీల ఆత్మ బంధువు అయిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చాలాకాలం నుంచి ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తున్న విషయం విదితమే. పలు సార్లు ధర్నాలు, దీక్షలు నిర్వహించడమే కాకుండా విగ్రహ ఏర్పాటు ఆవశ్యకతపై పలు జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను రెండు సార్లు కలిసి వినతి పత్రాలు కూడా అందించారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో పోరాటాన్ని ఉధృతం చేశారు. విగ్రహ ఏర్పాటుపై ఈ నెల 11న పూలే జయంతిలోగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో తులం రూ.56 వేలకు?
కాగా, ఇందిరా పార్కు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం బొళ్ల శివ శంకర్ విలేకరులతో మాట్లాడుతూ.. బీసీల విషయంలో ప్రభుత్వం చిన్న చూపు తగదని సూచించారు. బీసీల ఆరాధ్య దైవమైన పూలే విగ్రహాన్ని చట్టసభల ఆవరణలో ఏర్పాటు చేసి గౌరవించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ ను ప్రభుత్వం విస్మరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. బీసీల అంశాలు, సమస్యలపై అనేక జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించామని, వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని వివరించారు. బీసీలను మోసం చేస్తూ సహించేదే లేదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత దీక్షకు వేలాది మంది ప్రజలు, బీసీలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
Also Read: Lady Aghori: ప్రభాస్ ఇంటి పక్క ఆ విల్లాపై అఘోరీ క్లారిటీ.. అది మాత్రమే నిజం