/rtv/media/media_files/2026/02/17/kcr-kavitha-2026-02-17-12-02-04.jpg)
రాజకీయాల్లో బంధాల కంటే పదవులకే విలువా? తండ్రి కంటే నాయకుడే ముఖ్యమా? ప్రస్తుతం సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఒక ట్వీట్ చూస్తుంటే సగటు కార్యకర్తకు కలుగుతున్న సందేహాలివి. మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72వ పుట్టినరోజు సందర్భంగా ఆయన గారాల పట్టి కవిత చేసిన శుభాకాంక్షల ట్వీట్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది.
ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 17, 2026
కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని కవిత ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు" అంటూ పోస్ట్ చేశారు. సాధారణంగా ఏ కూతురైనా తన తండ్రికి శుభాకాంక్షలు చెప్పేటప్పుడు నాన్న లేదా తండ్రి అని సంబోధించడం సహజం. కానీ కవిత మాత్రం ఒక పొలిటికల్ స్టేట్‌మెంట్ లాగా కేవలం నాయకులు,గౌరవ పెద్దలు అని మాత్రమే పేర్కొనడం అందరినీ షాక్ కు గురిచేసింది.
ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు కవితపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.కవిత తన ట్వీట్‌లో కేసీఆర్ ఫోటోను పెట్టకుండా, కేవలం అక్షరాలతోనే ముగించడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు.సొంత తండ్రిని నాన్న అని పిలవడానికి కూడా రాజకీయాలు అడ్డొస్తున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో అంటే- కవిత బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆమె "హ్యాపీ బర్త్ డే డాడీ" అంటూ ఎంతో ప్రేమగా చేసిన ట్వీట్లను ఇప్పుడు బయటకు తీసి వైరల్ చేస్తున్నారు. పదవి ఉన్నప్పుడు డాడీ.. పదవి పోయాక గౌరవ పెద్దలా? అంటూ మండిపడుతున్నారు.
You didn't learn anything from KCR. pic.twitter.com/UP95VI2LlC
— Sanjay (@Undefinedacess) February 17, 2026
సొంత పార్టీ పైన విమర్శలు
కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ వచ్చాక కవిత ఏకంగా సొంత పార్టీ పైన విమర్శలు చేస్తూ వచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ హైకమాండ్ కవితను సస్పెండ్ చేయగా, అందుకు ప్రతిగా ఆమె తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ జాగృతితో పలు వేదికలపై ఆమె రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. త్వరలోనే పార్టీ పెడతానని, వచ్చే టర్మ్ లో అధికారంలోకి వస్తామని కవిత ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Follow Us