farmhouse meeting: KCR ఫామ్ హౌస్‌కు వెళ్లిన ఎమ్మెల్యే హాస్పిటల్‌పాలు

ఎర్రవల్లి ఫామ్‌హౌస్ మీటింగ్‌కు వెళ్లిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అస్వస్థత చెందారు. సమావేశం అనంతరం తిరిగివస్తుండగా ఆమె అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఆమెను హాస్పిటల్‌లో చేర్పించారు. ఫుడ్ పాయిజన్ వల్లే ఆమెకు ఇలా అయ్యిందని డాక్టర్లు తెలిపారు.

New Update

పార్టీ మీటింగ్ కోసం శుక్రవారం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అస్వస్థతకు గురైయ్యారు. సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మార్చి 7న పార్టీ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫుడ్ పాయిజన్‌కు గురైయ్యారు.

నిన్న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లారు. సమావేశం అనంతరం తిరుగు ప్రయాణంలో ఆమె  అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే సబితా ఇంద్రా రెడ్డిని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ఆమెకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఫుడ్ పాయిజన్ వల్లే అస్వస్థకు గురైందని నిర్థారించినట్లు సమాచారం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bandi sanjay : కాంగ్రెస్ అంతరించిపోతున్న జాతి.. రేవంత్కు బండి సంజయ్ కౌంటర్

సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ ల మధ్య డైలాగ్‌ వార్ నడుస్తోంది. అహ్మదాబాద్‌ వేదికగా ఏఐసీసీ మీటింగ్‌లో రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో బీజేపీని కాలు కూడా పెట్టినివ్వనని..  బ్రిటిషర్ల కంటే బీజేపీ చాలా ప్రమాదకరమంటూ సీఎం కామెంట్స్ చేశారు.

New Update
bandi-sanjay counter

bandi-sanjay counter

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్‌ ల మధ్య డైలాగ్‌ వార్ నడుస్తోంది. అహ్మదాబాద్‌ వేదికగా నిన్న జరిగిన  ఏఐసీసీ మీటింగ్‌లో రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో బీజేపీని కాలు కూడా పెట్టినివ్వనని..  బ్రిటిషర్ల కంటే బీజేపీ చాలా ప్రమాదకరమంటూ సీఎం కామెంట్స్ చేశారు. అయితే సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఎక్స్‌ వేదికగా బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ పగటి కలలు మానుకోవాలని..  సీఎం సొంత జిల్లా, సిట్టింగ్‌ సీట్‌లో గెలిచామన్నారు సంజయ్.  కాంగ్రెస్ అంతరించిపోతున్న జాతి అంటూ  సంజయ్ కామెంట్స్ చేశారు.  

Advertisment
Advertisment
Advertisment