తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో సారి హాట్ టాపిక్‌గా మారారు. తన ఫోన్ ట్యాప్ చేశారని బుధవారం సాయంత్రం ఆయన బంజారాహిల్స్ పీఎస్ ముందు హల్ చల్ చేశారు. పోలీసులు ఫిర్యాదు ఇచ్చినా పట్టిచుకోవడం లేదని పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించాారు. పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషల్ లో విధులకు ఆటంకం కలిగించారని సీఐ రాఘవేంద్ర ఫిర్యాతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన పై కేసు నమోదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు 20 మంది మీద పోలీసులు పలు సెక్షన్లతో కేసు ఫైల్ చేశారు. ఇది కూడా చదవండి : మీ బాగోతాలు బయపపెడతే అవి ఏక్కడ మడిచి పెట్టుకుంటారు: కొండా సురేఖ ఫైర్ డిసెంబర్ 5న (గురువారం) ఉదయం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కొండాపూర్ లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు భారీగా ఆయన నివాసానికి వెళ్లారు. అదే సమయానికి మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, హరీశ్ రావులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నారు. బలవంతంగా కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లాలని ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇది కూడా చదవండి : మీది ప్రజాపాలన కాదు.. రాక్షసపాలన.. కౌశిక్‌రెడ్డి ఇష్యుపై హరీష్‌రావు ఆగ్రహం గేట్లు దూకి పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లడానికి హరీశ్ రావు అనుచరులు యత్నించారు. పోలీసులను అడ్డుకుంటున్న హరీశ్ రావును గచ్చిబౌలి అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. అనంతరం పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.