Harish Rao : హైడ్రా హైడ్రోజన్ బాంబులా మారింది: హరీష్ రావు

TG: హైడ్రా బాధితులతో హరీష్ రావు భేటీ అయ్యారు. హైడ్రా పేదల పాలిట హైడ్రోజన్ బాంబులా మారిందని అన్నారు. కేసీఆర్‌ పాలనలో ప్రజలను ఇబ్బందిపెట్టలేదన్నారు. మూసీపై అఖిలపక్షం సమావేశం తర్వాత ముందుకెళ్లాలని సీఎం రేవంత్‌కు సూచించారు.

New Update
Harish Rao

Harish Rao: తెలంగాణ భవన్‌లో హైడ్రా బాధితులతో మాజీ మంత్రులు హరీష్ రావు, సబిత సమావేశం అయ్యారు. కేసీఆర్‌ పాలనలో ప్రజలను ఇబ్బందిపెట్టలేదని అన్నారు. రేవంత్‌రెడ్డి సోదరునికి నోటీసులిచ్చి 45 రోజులు టైం ఇస్తారా? అని ప్రశ్నించారు. పేదోడికైతే రాత్రిరాత్రికే వచ్చి బుల్డోజర్లతో కూలగొడతారా? అని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలోనే బాధితులంతా ఇండ్లకు పర్మిషన్ ఇచ్చారని అన్నారు. కష్టంతో భూములు కొనుక్కున్నారు.. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు.

కాంగ్రెస్సే ఇచ్చింది...

1993 కాంగ్రెస్ ప్రభుత్వమే వీరికి పరిష్మన్లు ఇచ్చిందని అన్నారు. ఇప్పుడు వాటిని కూల్చడం అన్యాయం అని పేర్కొన్నారు. రేవంత్ .. నువ్వు చేస్తున్న గొప్ప పనేంటి..? సుందరీకరణ? అని ప్రశ్నించారు. కేసీఆర్ మిషన్ భగీరథ పెడితే.. ప్రతీ ఇంటికి నీరంది ప్రజలకు మేలు జరిగిందని... కాళేశ్వరం కడితే లక్షాలాది మంది రైతులకు సాగు,తాగు నీరందింది దాని వల్ల ప్రజలకు మేలు జరిగిందని అన్నారు. రేవంత్‌రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు పారిస్తానంటున్నాడని.. పేద మధ్య తరగతి ప్రజల రక్తం, కన్నీళ్లు పారించే ప్రయత్నం చేస్తున్నావని ఫైర్ అయ్యారు. హైడ్రా.. హైడ్రా.. హైడ్రోజన్ బాంబులా మారిందని అన్నారు. ఎవరికీ కంటిమీద కునుకులేకుండా పోయిందని అన్నారు. సోషల్ మీడియాలో వీడియోలు చూస్తే పేదల గుండెలు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇబ్బందిపెట్టలేదు..

కేసీఆర్‌ పాలనలో ప్రజలను ఇబ్బందిపెట్టలేదని అన్నారు. మూసీపై అఖిలపక్షం సమావేశం తర్వాత ముందుకెళ్లాలని చెప్పారు. సీఎం రేవంత్‌ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో పాలన చేస్తున్నారని మండిపడ్డారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న అంశంపై దృష్టి పెట్టాలని అన్నారు.

Also Read :  తండ్రిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కొడుకులు.. 30 ఏళ్ల తర్వాత ఎలా బయటపడిందంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు