Telangana: రెండు ప్యాకేజీలుగా హైదరాబాద్‌-మచిలీపట్నం జాతీయ రహదారి: మంత్రి కోమటిరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌-మచిలీపట్నం జాతీయ రహదారిని రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని నితిన్ గడ్కరీ ఆదేశించినట్లు తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రీజినల్ రింగ్‌ రోడ్డు (RRR)కు సంబంధించి అన్ని పర్మిషన్లు మరో రెండు నెలల్లోఇస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పినట్లు తెలిపారు. దీనికి అన్ని క్లియరెన్స్‌లు వచ్చాక ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రీజినల్ రింగ్‌ రోడ్డు, హైవేల కోసం నితిన్ గడ్కరీతో సమావేశం జరిగిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

Also Read: పాకిస్థాన్‌లో ట్రైన్‌ను హైజాక్ చేసిన ఉగ్రవాదులు.. నిర్బంధంలో వందలాది ప్రయాణికులు

'' సంగారెడ్డి-భువనగిరి-చౌటుప్పల్ వరకు రీజినల్ రింగ్ రోడ్డు టెండర్ల ప్రక్రియ అంతా పూర్తి అయ్యింది. దాదాపు 95 శాతం వరకు భూసేకరణ కూడా పూర్తి చేశాం. రూ.వెయ్యి కోట్లతో 12 ఆర్వోబీలు మంజూరు చేశాం. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి ఆరు లేన్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు.   

Also Read: ఆయుధాల దిగుమతిలో భారత్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో ఉక్రెయిన్ !

హైదరాబాద్‌ నుంచి మచిలీపట్నం వరకు రోడ్డు విస్తరణ పనులు ఆలస్యమవుతున్నాయి. అందుకే గుడిమల్కాపూర్‌ నుంచి విజయవాడ వరకు ఒక ప్యాకేజీ, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మరో ప్యాకేజీగా విభజించి టెండర్లు పిలవాలని గడ్కరీ అధికారులను ఆదేశించారు. 62 కిలోమీటర్ల వరకు శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌కు సంబంధించి స్పెషల్ మీటింగ్‌ను ఏర్పాటు చేసి చర్చిస్తామని గడ్కరీ చెప్పారని'' మంత్రి కోమటిరెడ్డి వివరించారు. 

Also Read:  ప్రపంచంలో అత్యంత 20 కాలుష్య నగరాల్లో 13 మనవే!

Also Read: BJP సీనియర్ లీడర్‌కు పాయిజన్ ఇచ్చి చంపిన దుండగులు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు