Mini Medaram: నేటి నుంచే సమ్మక్క -సారలమ్మ చిన్న జాతర.. భక్తులతో కళకళలాడుతున్న మేడారం

మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. సాధారణంగా రెండేళ్లకొకసారి మహాజాతరను నిర్వహించగా.. మినీ జాతరను ఏడాదికి జరుపుకుంటారు. ఈ క్రమంలోనే నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించనున్నారు. భక్తులతో మేడారం భారీ సంఖ్యలో కళకళలాడుతోంది.

New Update
Mini Medaram

Mini Medaram Photograph: (Mini Medaram)

Mini Medaram: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు జరగనుంది. అయితే రెండేళ్లకు ఒకసారి మేడారం మహాజాతరను నిర్వహిస్తారు. మధ్యలో మినీ జాతరను కూడా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల పాటు ఈ మినీ జాతరను నిర్వహిస్తున్నారు. మినీ జాతర కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. మేడారం భక్తులతో కళకళలాడుతుంది. మండమెలిగే పండుగతో మినీ జాతరను ప్రారంభిస్తారు. నేటి నుంచి భక్తులు మొక్కులు చెల్లిస్తారు. 

ఇది కూడా చూడండి: supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిదే

ఇది కూడా చూడండి: Trump: ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్‌ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!

భక్తులతో కళకళలాడుతున్నా మేడారం..

ఈ మినీ జాతర కోసం ముందుగానే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మేడారం మినీ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దమొత్తంలో వెళ్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపుగా 20 లక్షల మంది ఈ మినీ జాతరకు రానున్నట్లు అధికారులు అంచనా వేశారు.

ఇది కూడా చూడండి: Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoists In Karre Gutta : కర్రెగుట్టల్లో కాల్పుల మోత..సరిహద్దులన్నీ మూసేసి..బాంబుల వర్షం

గత మూడు రోజులుగా సంచలనం రేపుతున్న ఆపరేషన్‌ కర్రెగుట్టలు మొదలైంది. ఈ ఉదయం నుంచి గుట్టల్లో బాంబుల మోత మోగుతోంది. కర్రె గుటల్లో హిడ్మా దళం ఆచూకీ కనిపెట్టేందుకు 12 వేల మందితో కూడిన భద్రతా బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి.

New Update
Operation Karre Gutta

Operation Karre Gutta

Maoists In Karre Gutta :  గత మూడు రోజులుగా సంచలనం రేపుతున్న ఆపరేషన్‌ కర్రెగుట్టలు మొదలైంది. ఈ ఉదయం నుంచి గుట్టల్లో బాంబుల మోత మోగుతోంది. కర్రె గుటల్లో మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతున్నది. హిడ్మా దళం ఆచూకీ కనిపెట్టేందుకు 12 వేల మందితో కూడిన భద్రతా బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. తెలంగాణ, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ సరిహద్దులోని ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లోని కర్రె గుటల్లో రెండ్రోజులుగా మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి.

Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

అడుగడుగునా పోలీసుల దిగ్బంధం, రహదారుల మూసివేత కారణంగా సామన్యులెవరూ కర్రెగుట్టల వైపు వెళ్లడానికి సాహసించడం లేదు.  గుట్టలు. బాంబుల మోతతో దద్దరిల్లుతుండడాన్ని స్థానికులు నిర్దారించారు. అయితే.. భీమారంపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీసు బేస్‌ నుంచి ముందుకు వెళ్లడానికి వీల్లేదని గ్రామస్థులను నిలిపివేశారు. అలాగే చుట్టూ పక్కల ఉన్న ఆదీవాసీలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని బలగాలు హెచ్చరించాయి.   మావోయిస్టులు సేఫ్ జోన్‌‌‌‌గా ఏర్పరచుకున్న స్థావరాల వద్దకు పోలీస్ బలగాలు చేరు కున్నట్టు తెలుస్తున్నది. ఈ బలగాలకు అవసరమైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర సరుకులను హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌లో సరఫరా చేస్తున్నారు. బుధవారం ఉదయం వెంకటాపురం మండల కేంద్రంలో రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యాయి. ఆ హెలికాప్టర్ల నుంచి వాటర్ బాటిల్స్, కొన్ని బాక్సులు గుట్టల వద్దకు తీసుకుపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.  

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

అడవుల్లోకి రావొద్దని ప్రజలకు హెచ్చరిక.. 

అడవుల్లోకి రావొద్దని సమీప గ్రామాల ప్రజలకు రెండ్రోజుల క్రితమే పోలీసులు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తున్నది. విధుల్లో భాగంగా గుట్టల వద్దకు వెళ్లవద్దని ఉన్నతాధికారులు తెలిపినట్టు అటవీ శాఖ సిబ్బంది కూడా చెబుతున్నారు. రెండ్రోజులుగా గుట్టల్లో ఎన్‌‌‌‌కౌంటర్ జరుగుతున్నట్టు స్థానిక గిరిజనులు చెబుతున్నారు. అడవిలో కాల్పులు జరిగినట్టు, భారీగా శబ్దాలు వస్తున్నట్టు సమీప గ్రామాల్లోని ప్రజలు పేర్కొంటున్నారు. అయితే అసలు గుట్టల్లో ఏం జరుగుతున్నది? అనే వివరాలు మాత్రం పోలీసులు చెప్పడం లేదు. పోలీస్ ఉన్నతాధికారులు వెంకటాపురం వస్తున్నట్టు బుధవారం ప్రచారం జరిగింది. దీంతో మావోయిస్ట్ అగ్ర నేత హిడ్మా దళం గురించి ఏవైనా వివరాలు వెల్లడిస్తారని భావించినా, ఉన్నతాధికారులు ఎవరూ రాలేదు. కాగా, కర్రె గుటల్లో కూంబింగ్ జరుగుతున్న మాట వాస్తవమేనని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ చెప్పారు. చత్తీస్‌‌‌‌గఢ్ రాష్ట్ర పోలీసులతో పాటు సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్ బలగాలు అందులో పాల్గొంటున్నాయని బుధవారం తెలిపారు. అయితే ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో ఎందరు చనిపోయారు? అనే విషయం తమకు తెలియదని చెప్పారు.  

ఇది కూడా చదవండి: ఈ పండ్లు తింటే క్యాన్సర్‌ పరార్.. ఆ అద్భుతమైన ఆహారాలు ఇవే

 మందుపాతరల నిర్వీర్యం

కాగా గత కొంతకాలం క్రితమే కర్రెగుట్టల చుట్టూ మందుపాతరలు అమర్చామని సామాన్యులు అటువైపు వచ్చి ప్రాణాలు కోల్పొవద్దని మావోయిస్టులు హెచ్చరించారు. తాజాగా పోలీసు బలగాలు గుట్టను చుట్టుముట్టడంతో పాటు గుట్టల చుట్టూ జల్లడపడుతున్నాయి. సుమారు 4 వేల మందికి పైగా సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా, డీఆర్‌జీ, బస్తర్‌ఫైటర్స్‌ బలగాలతోపాటు.. తెలంగాణ పోలీసులు కూడా కర్రెగుట్టలను చుట్టుముట్టిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు కూంబింగ్‌ కొనసాగిస్తూనే.. బాంబ్‌ డిస్పోజబుల్‌, డాగ్‌ స్క్వాడ్‌లు గుట్టల చుట్టూ మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను గుర్తించి, నిర్వీర్యం చేస్తున్నాయి. తెలంగాణ వైపు.. వెంకటాపురం మండలంలోని రాచపల్లి కలిపాక, మోట్లగూడెం ప్రాంతాల వరకు కూడా బాంబు పేలుడు శబ్దం వినిపిస్తోందని స్థానికులు తెలిపారు. ఈ పేలుళ్లు మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను బలగాలు నిర్వీర్యం చేస్తున్న క్రమంలో సంభవిస్తున్నట్లు సమాచారం.

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!


కాల్పులు విరమణ పాటించండి : పీస్‌ డైలాగ్‌ కమిటీ


కాగా కర్రెగుట్టలను భద్రత బలగాలు ముట్టడించిన నేపథ్యంలో  పీస్‌ డైలాగ్‌ కమిటీ స్పందించింది. కేంద్రం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ ప్రభుత్వాలు వెంటనే కాల్పుల విరమణను పాటించి, మావోయిస్టులతో శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాలని పీడీసీ చైర్మన్‌ జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు  బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీడీసీ వైస్‌ చైర్మన్లు జంపన్న, బాలకృష్ణారావు, కందిమల్ల ప్రతాప్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ వినాయకరెడ్డి, ఎస్‌.జీవన్‌కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. హింస వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. మావోయిస్టులు ఇప్పటికే మూడు సార్లు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినందున కాల్పులు విరమించాలని కోరారు. కర్రెగుట్టల చుట్టూ 10 వేల మంది పోలీసులను మోహరించి, కూంబింగ్‌ చేస్తున్నారు. మావోయిస్టుల పేరుతో అమాయక ఆదివాసీలను కాల్చిచంపుతున్నారని వారు ఆరోపించారు. కర్రెగుట్ట నుంచి పోలీసు బలగాలను వెనక్కి రప్పించడానికి సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపాలి అని వారు డిమాండ్‌ చేశారు.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?

 

Advertisment
Advertisment
Advertisment