Harish Rao: రైతు బంధు ఎప్పుడు వేస్తారు?.. హరీష్ రావు ఫైర్!
రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రైతు బంధు పెంచుతాం అన్నారు.. పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు అని రాష్ట్ర సర్కార్ ను ప్రశ్నించారు.
రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రైతు బంధు పెంచుతాం అన్నారు.. పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు అని రాష్ట్ర సర్కార్ ను ప్రశ్నించారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోధ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కాలు జారి కింద పడగా.. ఆయన తుంటి ఎముక విరిగినట్లు సమాచాం. దాంతో ఆయన సికింద్రాబాద్‌లోని యశోధ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భట్టి విక్రమార్క, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి తొలిసారి మంత్రి అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలో మంత్రిగా పని చేయలేదు.
తెలంగాణలో 2014 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అర్హులైన కుటుంబాల సంఖ్య పెరిగిపోవడంతో కొత్తగా ఏర్పడబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాలు ఆశలు పెట్టుకున్నారు. ఆరు గ్యారంటీలతోపాటు ఈ ప్రక్రియను కాంగ్రెస్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించాలని డిసైడ్ అయిన కాంగ్రెస్ హైకమాండ్.. మంత్రుల లిస్ట్ ను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ఉత్తమ్ కు ఫైనాన్స్, సీతక్కకు హోం మంత్రి ఇవ్వాలని నిర్ణయించిన అధిష్టానం.. మరో ముగ్గురికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ సీఎం పదవి రేసులోకి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా వచ్చారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రి, డిప్యూటీ సీఎంగా పని చేసిన తనకు అవకాశం కల్పించాలని ఆయన హైకమాండ్ ను కోరుతున్నట్లు సమాచారం.
మెదక్ జిల్లా చేగుంట మండంలం వడియారం సమీపంలో కాలిపోయిన ఓ యువతి మృతదేహం వెలుగుచూడటం కలకలం రేపింది. దాదాపు 25 ఏళ్లున్న ఓ యువతిని దుండగులు ఎక్కడో హత్య చేసి ఇక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించారని ఆధారలను బట్టి తెలుస్తోందని పోలీసులు తెలిపారు.
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తరువాత కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అయితే, ప్రస్తుతం కేసీఆర్ ఏం చేస్తున్నారు అనేదానిపై రాష్ట్ర ప్రజల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణలో సీఎం రేసులో పీసీసీ చీఫ్ రేవంత్ ముందంజలో ఉండగా.. డిప్యూటీ సీఎం రేసులో ఆరుగురు నేతలు ఉన్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, అద్దంకి దయాకర్ లాంటి నేతలు ఈ పదవికి పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.