Telangana Elections: ఈ సారి అసెంబ్లీలోకి 10 మంది మహిళలు.. లిస్ట్ ఇదే!
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి మొత్తం 33 మంది మహిళలు పోటీచేశారు. ఇందులో 10 మంది గెలుపొందగా తొలిసారిగా ఎన్నికైన వారే అధికంగా ఉండటం విశేషం.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి మొత్తం 33 మంది మహిళలు పోటీచేశారు. ఇందులో 10 మంది గెలుపొందగా తొలిసారిగా ఎన్నికైన వారే అధికంగా ఉండటం విశేషం.
పటాన్చెరు నియోజకవర్గంలో కౌంటింగ్‌కు బ్రేక్ పడింది. రీకౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ పడ్డారు. దీంతో అధికారులు కౌంటింగ్‌ను ఆపేశారు.
మెదక్ లో మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్ తగిలింది. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు గెలిచారు.
తెలంగాణలో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. తాజాగా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి కాంతారావు గెలిచారు.
సీఎం కేసీఆర్ ఈ రోజు గజ్వేల్ సభతో తన ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు.. సచ్చేది లేదని తన మార్క్ డైలాగ్ లను పేల్చారు. 24 గంటల కరెంట్ ఉండాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆఖలి చావులన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వేరు వేరు గ్రామాలకు చెందిన ముగ్గురు యువకులు, ఇద్దరు బాలురు నీట మునిగి మరణించిన సంఘటనలు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఇందులో ముగ్గురు చేపలు పట్టడానికి వెళితే, మరో ఇద్దరూ స్నానానికి వెళ్లి ఈత రాకపోవడంతో మృతిచెందారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో చట్ పూజల్లో పాల్గొన్నారు బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్. అనంతరం ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తాను గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
రంగస్థలం సినిమా స్టోరీతో అధికార పార్టీని ఓ ఆటఆడుకున్నారు బీజేపీ మాజీ అధ్యక్షుడు బండిసంజయ్. నారాయణఖేడ్ లో సామాన్యుడికి, ఆసాములకు మధ్య జరుగుతున్న పోటీ అన్నారు. మీకు ఏం జరిగినా సంగప్ప ఉన్నాడు..సంగప్పకు ఏం జరిగినా నేనున్నా...నాకేం జరిగినా మోదీ ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.