వరుస ఎన్ కౌంటర్లతో వందలాది మంది మావోయిస్టులు పిట్టల్లా రాలుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చలకు సిద్ధమని వెల్లడించారు. ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రలో కాల్పులు నిలిపివేయాలని బహిరంగ లేఖ విడుదల చేశారు. తాము కూడా కాల్పుల విరమణను పాటిస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. మార్చి 24న హైదరాబాద్ లో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణ ను స్వాగతిస్తున్నామన్నారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. తాము చేస్తున్న ఈ ప్రతిపాదనల ఆధారంగా శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. ఈ మేరకు శాంతి చర్చల కమిటీకి, దేశంలోని ప్రజాపక్ష మేధావులకు, రచయితలకు, జర్నలిస్టులకు, ఇతర సంఘాలకు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, నగరాల్లో, జిల్లా, తాలూకా కేంద్రాల్లో, యూనివర్సిటీల్లో ప్రచార క్యాంపెయిన్ ను చేపట్టాలని కోరారు.
ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాల్పులు.. వరంగల్ మహిళా మావోయిస్టు మృతి
శాంతి చర్చల కి మేం సిద్దం - మావోయిస్టులు
— Telugu Reporter (@TeluguReporter_) April 2, 2025
మావోయిస్టుల పై జరుగుతున్న దమన కాండను నిలుపుదల చేయాలంటూ ప్రకటన విడుదల
భారత ప్రభుత్వం-సీపీఐ (మావోయిస్టు) బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలి
మార్చి 24న హైదరాబాద్ లో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణ ను… pic.twitter.com/1WFM1BjDTb
2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వం, విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 'కగార్' పేరుతో విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్రాల ప్రజలపై ప్రతిఘాతక యుద్ధాన్ని ప్రారంభించాయని లేఖలో ఫైర్ అయ్యారు. ఆ సమయంలో ప్రజల్ని మోసగించడానికి ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి విజయ్ శర్మ తమ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపడానికి సిద్ధమే, మావోయిస్టులు చర్చలకు రావాలని పదే పదే ప్రకటనలు చేశాడన్నారు.
ఇది కూడా చదవండి: Naxalites : మావోయిస్టులకు బిగ్ షాక్.. లొంగిపోయిన 50 మంది నక్సలైట్లు!
చర్చలకు సిద్ధమని అప్పుడే ప్రకటించాం..
ఆ సమయంలో మా పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి కామ్రేడ్ వికల్ప్ తమ పార్టీ శాంతి చర్చలకు సిద్ధమేనని ప్రకటించినట్లు గుర్తు చేశారు. సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం 'కగార్' పేరుతో ఆదివాసీ ప్రజానీకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హత్యాకాండను నిలిపివేయాలని ప్రతిపాదించాడన్నారు. బస్తర్ ప్రాంతంలో మోహరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సాయుధ బలగాలను బ్యారక్ లకే పరిమితం చేయాలని సూచించాడన్నారు.
సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదన చేశాడన్నారు. ఈ ప్రతిపాదన పట్ల స్పందించకుండా, జవాబు ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత 15 నెలలుగా విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ లో ప్రతిఘాతక 'కగార్' యుద్ధాన్ని తీవ్రంగా కొనసాగిస్తున్నాయన్నారు. ఈ యుద్ధంలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 400కు పైగా మరణించారన్నారు. ఇందులో 1/3 సంఖ్యలో సాధారణ ఆదివాసీ ప్రజలు హత్య చేయబడ్డారని ఆరోపించారు.
(Tags : maoist | telugu-news | latest-telugu-news | telugu breaking news)
KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు
BRS meeting
KTR : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
కాంగ్రెస్ ను తిరస్కరించండి
‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించండి’’ అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
నలుగురికి భరోసానిచ్చేది బీఆర్ఎస్
ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు.సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఘనత సాధించిన పార్టీగా మనకు గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్
Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య
DC vs MI: ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం.. మంబయి స్కోర్ ఎంతంటే ?
AB Venkateswara Rao : జగన్ అంటే హత్యలు, అవినీతి, అరాచకం...మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం