మహారాష్ట్ర ఎన్నికలు.. డబ్బులు పంచుతూ దొరికిపోయిన బీజేపీ నేత

బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే.. పాల్ఘర్ జిల్లాలో డబ్బులు పంచుతూ దొరికిపోయారు. ఆయన తీసుకొచ్చిన బ్యాగ్‌లో ఏకంగా రూ.5 కోట్లు ఉన్నాయంటూ బహుజన్ వికాస్ అఘాడి (BVA) పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
BJPPP

బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ అనేక ప్రాంతాల్లో ధన ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓటింగ్‌కు ఓ రోజు బీజేపీ నేత డబ్బులు పంచుతూ దొరికిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే.. పాల్ఘర్ అనే జిల్లాలో ఈ తతంగం చేస్తుండగా పోలీసులకు దొరికిపోయారు. ఆయన తీసుకొచ్చిన బ్యాగ్‌లో ఏకంగా రూ.5 కోట్లు ఉన్నాయంటూ బహుజన్ వికాస్ అఘాడి (BVA) పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. 

Also Read: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!

ఇక వివరాల్లోకి వెళ్తే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్‌ నాయక్‌, వినోద్‌ తావ్డేలు ఓ హోటల్‌లో మీటింగ్ నిర్వహించారు. అయితే ఈ సమాశం జరుగుతుండగా ఓటర్లకు డబ్బులు పంచుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వీడియోలు, బహుజన్ వికాస్ అఘాడి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను వినోద్‌ తావ్డే ఖండించారు. సమావేశం జరిగే హోటల్‌ గదిలోకే కొంతమంది వద్ద నోట్ల కట్టలు కనిపించాయి. దీంతోనే అక్కడ వివాదం తలెత్తింది. వినోద్‌ తావ్డే అక్కడికి వచ్చిన ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీవీఏ నేతలు ఆరోపణలు చేశారు. అయితే వినోద్ తావ్డే మాత్రం ఆ బ్యాగ్ తనది కాదని చెబుతుండటం గమనించవచ్చు.   

Also Read: 25 నుంచి పార్లమెంట్.. జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలివే!

ఈ ఓటుకు వేటు ఘటనపై ఓ బీవీఏ నేత మాట్లాడారు. తావ్డే తనని హోటల్ రూం నుంచి బయటకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలి ప్రాధేయపడ్డారని చెప్పారు. తావ్డేతో సహా వసాయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఏవీ ఎమ్మెల్యే అభ్యర్థులు హితేంద్ర ఠాకూర్, ఆయన కొడుకు, నలసోపరా నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి క్షితిజ్ కూడా ఆ హోటల్ గదిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే తావ్డే తీరుపై బీవీఏ నేతలు సైతం ఆందోళనలు చేపట్టారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు హోటల్‌ను సీజ్ చేశారు. వినోద్‌ తావ్డేను బయటకు తీసుకొచ్చారు.  

Also Read: ఢిల్లీలో పీక్స్‌కు చేరిన కాలుష్యం.. తర్వలో కృత్రిమ వర్షం !

Advertisment
Advertisment
తాజా కథనాలు