/rtv/media/media_files/2025/02/22/oHoEDyq6ywe44ckwk2JH.jpg)
PRECAUTIONS IN LIFT ACCIDENTS
ప్రస్తుత కాలంలో మనం ఎక్కడికి వెళ్లినా లిఫ్ట్ అనేది కచ్చితంగా ఉపయోగిస్తుంటాం. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్, పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్, ఆఫీస్ ఇలా అన్నింటిలోనూ లిఫ్ట్‌లు ఉంటాయి. అయితే వాటిని ఉపయోగించడం ఎంత అవసరమో.. లిఫ్ట్ పనితీరును కూడా సరిగ్గా అర్థం చేసుకోవడం అంతే ముఖ్యం. లిఫ్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.
మీరు ఉండే పరిసరాల్లో లిఫ్ట్ ఉన్నట్లయితే కొన్ని సూచనలు పాటించడం చాలా ముఖ్యం. అందులోనూ పిల్లలు తరచూ లిఫ్ట్‌లలో ఎక్కి దిగుతుంటే వారికి కూడా దాని ఉపయోగం గురించి చెప్పాలి. దాన్నినుంచి బయటపడే మార్గం తెలియజేయాలి. ఇప్పుడు వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!
లిఫ్ట్ ఉపయోగించే వారు తెలుసుకోవలసినవి:
- లిఫ్ట్ తలుపులు ఓపెన్ కాకముందే బలవంతంగా తెరవడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే ప్రమాదం ఎదుర్కోవలసి ఉంటుంది.
- ఫోన్ కాల్ మాట్లాడుతూ లిఫ్ట్ డోర్స్ ఓపెన్ చేయకూడదు. ఒక్కోసారి లిఫ్ట్ రాకముందు డోర్స్ అన్‌లాక్ అయిపోతాయి. దీంతో మీరు చూడకుండా ఉంటే కిందికి పడిపోయే అవకాశం ఉంటుంది.
- ముఖ్యంగా మీరు ఉన్న అపార్ట్‌మెంట్స్‌లో లిఫ్ట్ ఉంటే మాత్రం పిల్లలకు కొన్ని సూచనలు చేయాలి. వారిని ఎప్పుడూ లిఫ్ట్‌లో ఒంటరిగా వదలకూడదు. ఒకవేళ అవసరం ఉంటే ముందుగా లిఫ్ట్ ఉపయోగం గురించి వారికి తెలియజేయాలి.
Also Read: Trump-Musk:మస్క్ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్ మార్చేసిన ట్రంప్!
- అగ్ని ప్రమాదం, భూకంపం మొదలైనప్పుడు.. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడినపుడు లిఫ్ట్‌ను ఎప్పుడూ ఉపయోగించకూడదు. అవి మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంటుంది.
- లోపల నుండి లిఫ్ట్ తలుపులు తెరిచి మీ చేతులతో ఆపడానికి ప్రయత్నించకూడదు. ఆటోమేటిక్ లిఫ్ట్‌లో డోర్స్ ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి.
- మీరు లిఫ్ట్‌లో చిక్కుకున్నట్లయితే.. అందులో ఇన్‌స్టాల్ చేసిన ఫోన్‌ని ఉపయోగించాలి. దాన్ని నుంచి సెక్యూరిటీ గార్డులకు సమాచారం అందించాలి.
- లిఫ్ట్‌లో సాంకేతిక లోపం ఏర్పడితే వెంటనే మెయింటెనెన్స్ వ్యక్తులకు తెలియజేయాలి. అంతేగానీ లిఫ్ట్‌ను ఆపడానికి బటన్‌ను పదే పదే నొక్కడం చేయకండి.
- లిఫ్ట్‌ను ఎప్పుడూ ఓవర్ లోడ్ చేయకూడదు. ఎందుకంటే అవి వాటి పరిమితిని కలిగి ఉంటాయి. ఆ పరిమితి దాటితే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
- మీరు లిఫ్ట్‌లో ఇరుక్కున్నట్లయితే పక్కనే ఉన్న అలారం బటన్ ఉపయోగించాలి. లేదా మీ ఫోన్ ద్వారా దగ్గరి వారికి సమాచారం అందించాలి.
- ముఖ్యంగా లిఫ్ట్‌లను రన్ చేస్తున్న యజమానులు వాటి పర్యావేక్షణ తరచూ చెక్ చేస్తూ ఉండాలి. ఏవైనా సమస్యలు ఉన్నాయా? లేదా అనేది చూడాలి. ఏమైనా సమస్యలు ఉంటే టెక్నీషియన్‌తో వాటిని వెంటనే క్లియర్ అయ్యేలా చూడాలి.