/rtv/media/media_files/2025/04/07/qpy1LhviDI45gQvc4FKh.jpg)
jagityala crime news
TG Crime: తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిదండ్రులపై కొడుకు విచక్షణరహితంగా దాడి చేశాడు. అమ్మనాన్న అని కూడా కనీసం కనికరం లేకుండా కొడవలి, గడ్డపారతో దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం రాజారాం గ్రామంలో జరిగింది. ఈ దాడికి ప్రధాన కారణం భూ వివాదం అని తెలుస్తోంది. దీని కారణంగానే తల్లిదండ్రులపై కొడుకు నరేశ్ దాడి చేశాడు.
భూ వివాదం.. తల్లిదండ్రులపై కొడుకు దాడి:
ఇది కూడా చదవండి: వీపు మీద మొటిమలు రావడానికి కారణం ఏమిటి?
ఈ దాడిలో తండ్రి నాగరాజు, తల్లి నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన దంపతులను జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై వివరాలు అడగి తెలుసుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: కోదాడలో విషాదం.. ప్రభుత్వ టీచర్ ప్రాణం తీసిన సిగరేట్.. అసలేమైందంటే?
( ts-crime | ts-crime-news | latest-news | telugu-news )
ఇది కూడా చదవండి: పెరుగు తింటే పెద్ద పేగు క్యాన్సర్ రాదా.. నిజమెంత?