Lakshmi Parvathi : తెలంగాణ హైకోర్టులో లక్ష్మీపార్వతికి షాక్.. బసవతారకం ట్రస్ట్‌ కేసులో కీలక ఆదేశాలు

వైఎస్సార్‌సీపీ నేత,మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావు భార్య నందమూరి లక్ష్మీపార్వతికి తెలంగాణ హైకోర్టులో బిగ్‌ షాక్‌ తగిలింది. బసవతారకం ట్రస్టుకు మేనేజింగ్ ట్రస్టీగా తనను నియమించాలని కోరుతూ 2009లో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించి కొట్టివేసింది.

New Update
Lakshmi Parvathi

Lakshmi Parvathi

Lakshmi Parvathi : వైఎస్సార్‌సీపీ నేత,మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావు భార్య నందమూరి లక్ష్మీపార్వతికి తెలంగాణ హైకోర్టులో బిగ్‌ షాక్‌ తగిలింది. బసవతారకం ట్రస్టుకు మేనేజింగ్ ట్రస్టీగా తనను నియమించాలని కోరుతూ 2009లో దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. 1995 నవంబర్ 18న ఎన్టీ రామారావు రాసిన సప్లిమెంటరీ విల్లుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దిగువ కోర్టు చట్ట ప్రకారం వ్యవహరించలేదని కోర్టు తెలిపింది. సప్లిమెంటరీ విల్లును నిరూపించే క్రమంలో సిటీ సివిల్ కోర్టు సరైన పద్ధతిలో వెళ్లలేదని హైకోర్టు స్పష్టం చేసింది. విల్లుపై సంతకం చేసిన సాక్షి జె. వెంకటసుబ్బయ్య వారసుడు జె.వి. ప్రసాద్‌రావును సాక్షిగా దిగువ కోర్టు గుర్తించింది. 2018లో దిగువ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయగా.. తాజాగా దీనిని హైకోర్టు కొట్టివేసింది.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

వెంకటసుబ్బయ్య, వై. తిరుపతిరావుకు సమన్లు ఇవ్వకుండా వారి వారసులను సాక్షులుగా స్వీకరించడం చెల్లదని హైకోర్టు తెలిపింది. వారు చనిపోయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని.. విల్లుపై సాక్షి సంతకం చేసిన వెంకట సుబ్బయ్య మరణించినట్లు నోటి మాట ద్వారా తెలుసుకుని ఆయన కుమారుడు జె.వి. ప్రసాద్‌రావును సాక్షిగా గుర్తించడం సరికాదని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది.1995లో రామారావు రాసినట్లు చెబుతున్న సప్లిమెంటరీ విల్లు ప్రకారం బసవతారకం ట్రస్టుకు తనను మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని లక్ష్మీపార్వతి 2009లో సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

సప్లిమెంటరీ విల్లులో సంతకం చేసిన వెంకట సుబ్బయ్య చనిపోవడంతో ఆయన కుమారుడు ప్రసాద్‌రావును సాక్షిగా గుర్తించాలని లక్ష్మీపార్వతి కోరారు. తన తండ్రి వెంకట సుబ్బయ్య మరణించారని.. అలాగే రామారావు విల్లు రాసిన విషయం నిజమేనని.. తన తండ్రి తనకు సమాచారం ఇచ్చినట్లుగా ప్రసాద్‌రావు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీంతో దిగువ కోర్టు ప్రసాద్‌రావును విచారించేందుకు అంగీకరించింది. అయితే, ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ బసవతారకం ట్రస్ట్, నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణలు హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy Rains: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్, వికారాబాద్,  మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి!

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో జల్లులు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉండగా గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్  జారీ చేసింది. 

Also Read: భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’

 

Advertisment
Advertisment
Advertisment