BIG BREAKING: కాళేశ్వరంపై హైకోర్టు కీలక తీర్పు.. సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్‌

కాళేశ్వరం స్కామ్‌పై విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌పై వేసిన పిటిషన్లపై హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎలాంటి రూల్స్‌ పాటించలేదని కోర్టు స్పష్టం చేసింది

New Update
KTR

KTR

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ కోసం రేవంత్ ప్రభుత్వం జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్‌పై దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులకు ఊరట కల్పించింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎలాంటి రూల్స్‌ పాటించలేదని కోర్టు స్పష్టం చేసింది. నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలూ చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: సమస్యల పరిష్కారానికి సిద్ధం...సమ్మె విరమించండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

కోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ సిగ్గువిడిచి కాళేశ్వరంపై విష ప్రచారం చేశాయని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి కుట్రలు గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయాయన్నారు. సీపీ ఘోష్ కమిషన్ నివేదిక కాదని.. అది పీసీసీ నివేదిక అని అప్పుడే చెప్పామన్నారు. హైకోర్టు తీర్పుతో తెలంగాణ ప్రజలు గెలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓడింది, రైతులు గెలిచారన్నారు.  రాజకీయ రాబంధులు, పిట్టల దొరలకు మొహం పగిలే తీర్పిదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కూలలేదని.. ఈ ప్రాజెక్టుపై వేసిన కుట్రలు కూలాయని సెటైర్లు వేశారు. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పుతో న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు