Local Elections: సర్పంచ్ ఎన్నికలపై కేటీఆర్ సంచలన నిర్ణయం!

స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ కీలక పిలుపునిచ్చారు. ఎవరూ ప్రేక్షక పాత్ర పోషించొద్దని, ప్రభుత్వం కుట్రపూరితంగా ఎన్ని కేసులుపెట్టినా భయపడొద్దని చెప్పారు. ప్రజలు తమవైపే ఉన్నారని, మళ్లీ దేశంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.

New Update
KTR Arrest Latest Reaction

KTR

Local Elections: మేడిగడ్డ ఇష్యూపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ రెడ్డి పుర్రెకు పడిందంటూ సెటైర్స్ వేశారు. మేడిగడ్డ బ్యారేజ్ అంశంలో కాంగ్రెస్ నేతలే ఏదో దొంగచాటుగా చేస్తున్నారనే అనుమానం కలుగుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు మరికొన్ని రోజుల్లో లోకల్ ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలు చిల్లపనులు చేసేందుకు కూడా వెనకాడట్లేదని మండిపడ్డారు. 

ప్రేక్షక పాత్ర పోషించొద్దు..

ఈ మేరకు మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు ఎవరూ ప్రేక్షక పాత్ర పోషించొద్దన్నారు. ప్రభుత్వం కుట్రపూరితంగా ఎన్ని కేసులు పెట్టినా భయపడొద్దని చెప్పారు. బీఆర్ఎస్ ను ఎవరూ ఏం చేయలేరని, సోషల్ మీడియాల్లో చిల్లర పోస్టులు పెట్టేవారిని వదిలిపెట్టమంటూ వార్నింగ్ ఇచ్చారు. బాక్సింగ్‌లో ఆటలో కిందపడ్డప్పటికీ నిలబడి కొట్లాడేవాడే వీరుడని, తాము వీరునిలాంటివారమన్నారు.  

ఇది కూడా చదవండి: Kiara Advani: 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్స్ కు కియారా అందుకే రావట్లేదా..?

హైడ్రా పేరిట పేదల పొట్ట కొడతారా..

లోక్ సభ ఎన్నికల్లో సున్నా సీట్లొచ్చినా భయపడలేదు. మళ్లీ దేశంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు దగ్గరలోనే ఉంది. 369 కోట్ల రెవెన్యూతో అధికారం చేపట్టిన తాము.. దిగిపోయేనాటికి 5 వేల 564 కోట్ల మిగులు కాంగ్రెస్‌ చేతిలో పెట్టామన్నారు. రెవెన్యూ మిగులు విషయంలో ముఖ్యమంత్రిది ఒక మాట, ఉప ముఖ్యమంత్రిది మరోమాట. 10 ఏళ్లలో బీఆర్ఎస్ 4 లక్షల 17 వేల కోట్లు అప్పు చేస్తే.. కాంగ్రెస్ ఒక ఏడాదిలోనే 1 లక్షా 37 వేల కోట్ల అప్పు చేసిందని విమర్శలు గుప్పించారు. మా అప్పుల వల్ల అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ చేసిన అప్పుల వల్ల ప్రజలకు ఏం ఒరిగిందో చెప్పాలి. హైడ్రా పేరిట పేదల పొట్ట కొట్టడం తప్ప ఏం చేయలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.

ఇది కూడా చదవండి: BIG BREAKING: HMPV వైరస్.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు