రైతులకు రైతుభరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. ఓట్ల కోసమే ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రైతు బంధువుగా, రేవంత్ రాబందుగా చరిత్రలో మిగిలిపోతారంటూ సెటైర్లు వేశారు. హైదరాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. Also Read: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి వారం రోజులు సెలవులు బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు పథకం కింద రూ.10 వేలు ఇస్తే చిచ్చమని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మరి ఇప్పుడు వీళ్లు చేస్తుందేంటి ?. తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే వెంటనే వస్తానని రాహుల్‌గాంధీ మాటిచ్చారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉంటే రాహుల్ ఎక్కడున్నారు ?. దేశంలో ధనిక రాష్ట్రమని విపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ అనేవారు. అధికారంలోకి వచ్చాక మాత్రం రాష్ట్రం అప్పులపాలైందని చెబుతున్నారు. వందరోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. Also Read: కాంగ్రెస్కు కేసీఆరే గురువు.. రైతు భరోసాకు భరోసానే లేదు : బండి సంజయ్ రైతు భరోసా కింద రైతులకు, అలాగే కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు రూ.12 వేలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారు. మూసీ, హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. ఆర్థక పరిస్థితి బాగోలేదంటే పెట్టుబడులు పెట్టడానికి, అలాగే అప్పులు ఇవ్వడానికి ఎవరు ముందుకొస్తారని'' కేటీఆర్ అన్నారు. అలాగే రైతులకు సంఘీభావం తెలిపేందుకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్‌ఎస్ శ్రేణలకు పిలుపునిచ్చారు . Also Read: ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లు మారుస్తా : బీజేపీ నేత సంచలన కామెంట్స్ Also Read: లవర్లకు ఓయో బిగ్ షాక్.. పెళ్లి కాని వారికి ఇక నో రూమ్!