ED: కేటీఆర్ కారు రేస్ కేసులో బిగ్ ట్విస్ట్..ఏసీబీకి BLNరెడ్డి కీలక లేఖ

ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ3గా ఉన్న హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి నేడు విచారణకు హాజరుకాలేదు. తనకు మరింత సమయం కావాలంటూ ఈడీకి మెయిల్ చేయగా ఈడీ అధికారులు తన విజ్ఞప్తికి అంగీకారం తెలిపారు. 

New Update
bln reddy car race

BLN Reddy E-car race case

ED: ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ3గా ఉన్నహెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి నేడు విచారణకు హాజరుకాలేదు. తనకు మరింత సమయం కావాలంటూ ఈడీకి మెయిల్ చేయగా ఈడీ అధికారులు తన విజ్ఞప్తికి అంగీకారం తెలిపారు. 

రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు

ఇక తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో కేటీఆర్‌-ఏ1, అరవింద్‌ కుమార్‌-ఏ2, బీఎల్‌ఎన్‌ రెడ్డి-ఏ3గా ఉన్నారు. అయితే జనవరి 3న ఈడీ విచారణకు ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌ హాజరు కానుండగా.. జనవరి 7న కేటీఆర్‌ ను ఈడీ విచారించనుంది. ఇక ఈ కేసులో ఫెమా నిబంధనలు ఉల్లఘించారని, అందుకే ఈసీఐఆర్‌ నమోదు చేసినట్టు ఈడీ అధికారులు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: BIG BREAKING: 5 నుంచి రైతు భరోసా అప్లికేషన్లు.. సర్కార్ సంచలన నిర్ణయం!

రూ.55కోట్లు విదేశీ కంపెనీలకు..


బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కారు రేసుకు సంబంధించి రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించినట్లు ఏసీబీ కీలక పత్రాలను ఈడీకి అప్పగించింది. ఆర్‌బీఐ పర్మిషన్ లేకుండానే ఇంత డబ్బు కేటాయించడంపై ఏసీబీ సైతం విచరాణ కోరింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌‌‌‌ అర్బన్ డెవలప్‌‌‌‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అరవింద్‌‌‌‌ కుమార్‌‌ చేతుల మీదుగా నిధులు తర్జుమా అయినట్లు బయటపడింది. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. 

ఇది కూడా చదవండి: Attack in USA: అమెరికాలో దాడులు.. సంచలన వీడియో రిలీజ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు