CASTE CENSUS : కులగణన సర్వే తప్పుల తడకని ఒప్పుకున్నట్లేగా...కేటీఆర్ సంచలనం

కాంగ్రెస్ చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.అయితే బీసీల జనాభాను తగ్గించి ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలన్నారు.

New Update
CASTE CENSUS

CASTE CENSUS

CASTE CENSUS : కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయితే బీసీల జనాభాను తగ్గించి వెనకబడిన వర్గాల ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు ముఖ్యమంత్రి రాష్ట్రంలోని బీసీలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసమగ్రంగా చేసిన సర్వేపై బీఆర్ఎస్ తోపాటు.. బీసీ సంఘాలు ముక్తకంఠంతో అభ్యంతరం వ్యక్తంచేసినా వినకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం  అసంపూర్తి  లెక్కల ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా ముమ్మాటికీ తప్పేనని అంగీకరించాలన్నారు.

Also Read :  106 కి.మీ.. ఉరి వేసుకోబోతున్న యువకుడిని ఏపీ పోలీసులు ఎలా కాపాడారంటే!


  రెండోసారి సర్వేనైనా సమగ్రంగా చేయడంతోపాటు.. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కేవలం తూతూమంత్రంగా తీర్మానం చేసి.. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకుందామంటే మాత్రం బీఆర్ఎస్ తోపాటు.. బీసీ సంఘాలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.మారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన మాటను సంపూర్ణంగా నిలబెట్టుకునే వరకూ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోని బీసీలెవరూ నమ్మే పరిస్థితిలో లేరనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకుంటే మంచిదని కేటీఆర్ కోరారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో పాల్గొనని వారికోసం మరోసారి కుల గణన సర్వే నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ప్రకటించారు. వివిధ కారణాల వల్ల సర్వేలో పాల్గొనని 3.1 శాతం మంది కోసమే ఈ సర్వే అని తెలిపారు. దీనికోసం ఈ నెల 16 నుంచి 28 వరరు మరోసారి కులగణన సర్వే నిర్వహిస్తున్నామన్నారు.

Also Read: Trump-musk: మస్క్‌ కు హై పవర్‌ ఇచ్చిన ట్రంప్‌...ఇక కోతలే..కోతలు!

కాగా ఇటీవల జరిగిన కులగణన పూర్తిగా తప్పుల తడకగా, అశాస్త్రీయంగా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. కులగణనలో ఐదున్నర శాతం జనాభాను తగ్గించారన్న కేటీఆర్ దాదాపు 22 లక్షల మంది ఉన్నవారిని లేనట్లుగా చిత్రీకరించారని కాంగ్రెస్ సర్కారుపై ధ్వజమెత్తారు. దీనిపై బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కులగణన చిత్తు కాగితంలో సమానమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తగులబెట్టారని కేటీఆర్ తెలిపారు.   కులగణనపై వెంటనే రీసర్వే చేసి లెక్కలు తేల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రీసర్వే విషయంలో తాము కూడా చొరవ తీసుకుంటామని తెలిపారు. కులగణనలో కేసీఆర్, కేటీఆర్ పాల్గొలేదని ఆరోపిస్తున్నారన్న ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారే పాల్గొనాలని తొలుత చెప్పారన్నారు. బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసేదాకా వదిలిపెట్టమని కేటీఆర్​ అన్నారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోతామన్నారు.

ఇది కూడా చదవండి: Jagan Vs Sharmila: చెల్లికి చెక్.. జగన్ సంచలన వ్యూహం.. ఆ నేతలంతా వైసీపీలోకి..!


42శాతమని బీసీ డిక్లరేషన్​లో చెప్పిన విధంగా ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పిస్తారని భావించామని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సభలో బిల్లు పెట్టాలని కేటీఆర్ కోరారు. గతంలో బీసీలకు 50 శాతానికి పైగా రిజర్వేషన్లను ఇచ్చామని గుర్తుచేశారు. అసెంబ్లీ, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించామని ఆయన తెలిపారు.  

Also Read :  కాపాడండయ్య నన్ను.. సైబర్ క్రైమ్‎ను ఆశ్రయించిన పృథ్వీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు