KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా

HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతామని చెప్పారు. ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి BJP, కాంగ్రెస్‌ల ఉమ్మడి ముఖ్యమంత్రి అని విమర్శించారు.

New Update
KTR

HCU భూముల విషయంలో నాకు ద‌క్కనిది ఎవ‌రికీ ద‌క్కకూడ‌ద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. కంచ గ‌చ్చిబౌలి భూముల వెనుక వేల కోట్ల బాగోతం ఉంది. కంచ గ‌చ్చిబౌలి భూముల వెనుక బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. భారీ భూకుంభకోణం బాగోతం మరో 2, 3 రోజుల్లో బయటపెడతానని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి ముఖ్యమంత్రి. దేశంలోని ప‌వ‌ర్ ఫుల్ సీఎంల్లో రేవంత్ నంబ‌ర్ వ‌న్‌గా ఉండాలి అని కేటీఆర్ అన్నారు.

ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని మేము అనొచ్చు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమ‌ర్శించారు. ఏఐ వీడియోల పేరుతో త‌ప్పించుకోవాల‌ని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాష్ట్రంలో నెగెటివ్ పాల‌సీలు, నెగెటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మాజీ స‌ర్పంచ్ నుంచి మాజీ సీఎం వ‌ర‌కు కేసులెలా పెట్టాల‌ని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాల‌నే ఉద్దేశంలో మేం లేము. హెచ్‌సీయూ విద్యార్థుల‌పై కేసుల ఉప‌సంహ‌ర‌ణ నిర్ణయాన్ని స్వాగ‌తిస్తున్నాం. కేసుల ఉప‌సంహ‌ర‌ణ స‌రిపోదు.. జంతువ‌ధ కార‌కుల‌పై కేసులు పెట్టాలి. సోష‌ల్ మీడియాలో మాపై ఎదురుదాడి చేయడానికి భారీగా ఖ‌ర్చు చేసి టూల్ కిట్ సాయంతో ఎదురుదాడికి పాల్పడుతున్నారు. బీసీ రిజ‌ర్వేష‌న్లు అసాధ్యమ‌నే కాంగ్రెస్ దీక్షకు రాహుల్ గాంధీ వెళ్లలేదు అని కేటీఆర్ గుర్తు చేశారు.

రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతుల్లోనే ఉంటుంది. ఒక‌రు చెప్పులు మోస్తే.. ఇంకొక‌రు బ్యాగుల‌ను మోస్తున్నారు. 16, 17 నెల‌లైనా మంత్రివ‌ర్గాన్ని విస్తరించుకునే ప‌రిస్థితి లేదు. ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా ఒక్క రూపాయి కూడా రాలేదు. మీనాక్షి న‌ట‌రాజ‌న్ స‌చివాల‌యంలో స‌మీక్షలు చేస్తున్నారు. రేవంత్ విఫ‌ల సీఎం కాబ‌ట్టే కాంగ్రెస్ హైక‌మాండ్ జోక్యం చేసుకుంటుంది. 

 

Advertisment
Advertisment
Advertisment