TG News: బీఆర్ఎస్ చేసిన తప్పులను బయటపెడితే కేసీఆర్ ను మించి కేటీఆర్ బూతులు మాట్లాడుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడుతున్న సీఎం రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం తగదన్నారు. కవిత, కేటీఆర్ చేసిన తప్పులు ఎత్తి చూపితే తలలు ఎక్కడ పెట్టకుంటారంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన సురేఖ.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధినీ చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావడం ఎందుకు రావడం లేదు. కేసీఆర్ ఫాం హౌజ్ లో పండుకుని కేటీఆర్ ను మా పైకి ఉసి గొల్పుతున్నాడు. మీరు ప్రజలకు మంచి పాలన అందిస్తే జనాలు మిమ్మలని ఎందుకు ఒడకొట్టారని ప్రశ్నించారు. మీ అవినీతి మొత్తం బయటపెడతాం.. సామాన్య కార్యకర్త నుండి సీఎంగా ఎదిగిన మా నాయకుడు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం తగదు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తరువాత రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చాయి. తప్పులు సృష్టించి మా మీద ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ ను మించి కేటీఆర్ బూతులు మాట్లాడుతున్నారు. కేడర్ కాదు ముందు నువ్వు పోరాటం చెయ్ కేటీఆర్.. తెలంగాణ వస్తుందని తెలిసిన తరువాత నువ్వు నీ చెల్లె తెలంగాణకి వచ్చారు. మేము తప్పులు చేయడం లేదు. మీరు చేసిన తప్పులను బయట పెడుతున్నాం. సోషల్ మీడియా ద్వారా జనాలకు మీ అవినీతి తెలిసింది. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ఎవరో వచ్చి పడగొడుతామాని అంటే ప్రభుత్వం పడిపోతుందా. బీఆర్ఎస్ వాళ్ళు జనాలను రెచ్చగోట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. తెలంగాణ కోసం అప్పుడు జనాలను రెచ్చగొట్టారు. వాళ్ళ మీద ఒక్క కేస్ కాలేదు. ఒక్కరూ కూడా దెబ్బ పడలేదని అన్నారు. అగ్గిపెట్టెలు సిద్ధంగా ఉన్నాయి.. విద్యార్థులారా కేటీఆర్ ఉచ్చులో పడకండి. మీ బంగారు జీవితాలను నాశనం చేసుకోకండి. రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. గతంలో ఒకరు పెట్రోల్ తెచ్చుకున్నారు.. అగ్గి పెట్టె మర్చి పోయారు. కానీ ఇప్పుడు పెట్రోల్ మీరు తెస్తే అగ్గిపెట్టెలు మాత్రం జనాలు తెస్తారు. కోమటి రెడ్డి అన్న తమ్ములకు మంచి రాజకీయ చరిత్ర ఉంది. తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి కోసం జనాలు వచ్చినట్టు.. జనాలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చూడడానికి నిజామాబాద్ కి వచ్చారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు భాదాకరం. మడిచి పెట్టుకో అని సీనియర్ నాయకుడు కోమటి రెడ్డి నీ ఎలా అంటాడు. మీ మీద ఉన్న కేస్ లు బయటపెడితే ఏమి మలిచి పెట్టుకుంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్కరు కూడా మిగలరు.. చెక్కల దందా బిజినెస్ చేసుకునే నీ మీద ఉన్న కేస్ లు బయట పెడితే ఎక్కడికి పోతావు. హుజూరాబాద్ లో ఒక పిచ్చోడు ఎమ్మెల్యే ఉన్నాడు. ఆలోచన మెదడు లేకుండా హుజూరాబాద్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు చెపుతున్న సలహాలు, సూచనలు చేయండి అంతే కానీ అర్ధం పర్థం లేని విమర్శలు ఎందుకు. మా నాయకుల మీద చిలువలు పలువలుగా మాట్లాడితే ఊరుకోం. మీ లాగా మేము అక్రమ అరెస్ట్ చేయదలుచుకుంటే ఒక్కరూ కూడా మిగలరు. ఫోన్ ట్యాపింగ్ లో మీ హస్తం లేకపోతే అధికారులను దేశాలు ఎందుకు దాటిస్తున్నారు. మీరు చేసేది మంచి అయితే విదేశాల నుండి యూట్యూబ్ లు ఎందుకు నడిపిస్తున్నారు. గతంలో ఉన్నట్లు ఇప్పుడు రాజకీయ సంస్కృతి లేదు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే తప్పని చెప్పండి అంతే కానీ లేని పోనీ విమర్శలు చేయకండి అని సూచించారు. ప్రతిపక్షాలు అంటే జనాలు ఆహ్వానించాలి కానీ జనాలు కేటీఆర్ ను దగ్గరికి రానివ్వడం లేదని, మళ్ళీ తామే అధికారం లోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంవత్సర కాలం ఓర్చుకున్నాము ఇక ఓర్చుకోము. ఏది పడితే అది మాట్లాడితే క్షమించము. మా పాలన చూసి వాళ్ళు ఓర్చుకోలేక పోతున్నారు. అధికారులు అధికార పార్టీకి తగ్గట్టుగా పని చేస్తారు. ఇప్పటి వరకు యూ ట్యూబ్ ల విషయంలో చేసిన తప్పులు ఇక చేయం. గతంలో తెలంగాణ తల్లి బొమ్మ నీ దొరసాని లాగా సృష్టించారు. గతంలో కవిత ఫేస్ లాగా తెలంగాణ తల్లి విగ్రహంను రూపొందించారు. మేము మన తెలంగాణ ప్రజల ఆత్మ నీ ఆవిష్కరిస్తున్నామని చెప్పారు.