/rtv/media/media_files/2026/03/17/latest-news-in-telugu-2026-03-17-21-25-41.jpg)
Khiladi couples
Khiladi couples : డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (Pharm.D) చదువుతున్న ఒక మహిళా డాక్టర్‌ను అని చెప్పుకుంటూ తన భర్తతో కలిసి రోగులకు మత్తుమందు ఇచ్చి నగలు కాజేస్తోంది. తాజాగా యశోధ ఆసుపత్రిలో నగలు కాజేసీ పోలీసులకు చిక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలానికి చెందిన గౌండ్ల శిరీష ప్రస్తుతం డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (Pharm.D) చదువుతోంది. అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవ్వడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు తన భర్తతో కలిసి ఆసుపత్రుల్లో దొంగతనాలకు ప్లాన్ చేసింది. వైద్య విద్యార్థి కావడంతో తనకున్న వైద్య పరిజ్ఞానంతో వృద్దులు, మహిళా రోగులను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతోంది. దానికోసం డాక్టర్ ఆప్రాన్ వేసుకుని తను చోరీ చేయాలనుకున్న ఆసుపత్రికి వెళ్లేది.
అక్కడ తను టార్గెట్ చేసుకున్న మహిళలను ఎంచుకుని వారికి 'డయాజెపామ్' (Diazepam) అనే మత్తు ఇంజక్షన్‌ను ఇచ్చేది. దీంతో వారు స్పృహ కోల్పోయేవారు. ఆ తర్వాత వారి బంగారు ఆభరణాలను దొంగిలించి పారిపోయేది. అలాగే వైద్యురాలిగా నటించి గత మార్చి 11న సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి, చందానగర్‌లోని సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చోరీలకు పాల్పడ్డారు. అలా దొంగిలించిన నగలను అమ్మి వచ్చిన సొమ్ముతో విలాసాలు, షాపింగ్‌లు చేస్తున్నారు. కాగా ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్.. మార్కెట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఆమెతో పాటు భర్త ఎడులపల్లి సాయి కుమార్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 తులాల బంగారం, మారుతీ సుజుకీ బాలెనో కారు, రెండు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన జీవితం కోసం.. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గం ఎంచుకున్నారని పోలీసులు తెలిపారు.
Follow Us