/rtv/media/media_files/2025/04/12/Kc9N9GoSNqDL8WAo8K79.jpg)
వనజీవి రామయ్య
కోటి మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడుగా వనజీవి రామయ్య అందరికీ తెలిసిన వారే. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన ఈయన తెలంగాణ వ్యక్తి. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య ఈరోజు తెల్లవారు ఝామున చనిపోయారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ..పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. రామయ్య కోటికి పైగా మొక్కలు నాటి రికార్డ్ స్పష్టించారు. వనజీవి రామయ్యకు 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీని ఇచ్చింది.
మొక్కలు నాటడంపై అవగాహనా కార్యక్రమాలు..
చిన్నప్పటి నుండి ‘చెట్లను పెంచండి’ అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం నింపుతూ.. స్వయంగా కోటి మొక్కలు నాటుతూ పర్యావరణానికి విశేషమైన సేవ చేశారు రాయమ్మ. ఈయన అసలు పేరు దరిపల్లి రామయ్య. కానీ ఆయన ప్రకృతికి చేసిన సేవ కారణంగా వనజీవి అనే బిరుదు వచ్చింది. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య పర్యావరణంలో తీవ్ర మార్పులని రామయ్య అనేవారు. దీనికి పరిష్కారం మొక్కలను, చెట్లను పెంచడమే అని చెప్పేవారు. ప్రతీ ఒక్కరూ కొత్త మొక్కలు నాటితే పచ్చదనం పెంపొందించగలుగుతామని రామయ్య బలంగా విశ్వసించారు. తమ మొత్తం జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేశారు. తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు రామయ్య. ఈయన మొక్కలు నాటడం గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. రామయ్య మాటలు ఎంతో ప్రభావ వంతంగా ఉండేవి. అందుకే భారత ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
today-latest-news-in-telugu | telangana | khammam
Also Read: China: మీరు పెంచితే మేము పెంచమా అంటున్న చైనా..125 శాతం సుంకం పెంపు