‘నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’.. కోర్టు బెంచ్‌ క్లర్క్ లైంగిక వేధింపులు!

భద్రాద్రి కొత్తగూడెం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మహిళా ఉద్యోగికి లైంగిక వేధింపులు ఎదురైయ్యాయి. క్లర్క్ సత్యనారాయణ కావాల్సింది ఇస్తే జాబ్ పర్మినెంట్ చేస్తా అంటూ ఆఫర్లు ఇచ్చాడు. అసభ్యంగా తాకుతూ ఆమెను ఇబ్బంది పెడుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

New Update
Bhadradri Kothagudem Court 12

Bhadradri Kothagudem Court 12 Photograph: (Bhadradri Kothagudem Court 12)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. అందరికీ న్యాయం జరిగే కోర్టులోనే మహిళా ఉద్యోగికి లైంగిక వేధింపులు ఎదురైయ్యాయి. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఉద్యోగి మహిళా ఉద్యోగిరాలిని లైంగికంగా వేధింస్తున్నాడు. సదరు మహిళతో కోర్టు బెంచ్‌ క్లర్క్ సత్యనారాయణ నీచపు పనులు ఒడిగట్టాడు. అసభ్యంగా తాకుతూ ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ట్యూబెక్టమీ చేయించుకున్నావా.. ఎంజాయ్ చేద్దామా అంటూ వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. 

Also read: US airstrikes: అమెరికా వైమానిక దాడిలో 19 మంది మృతి!

Also read: Pakistan terrorist : పాకిస్తాన్‌లో హత్యకు గురైన లష్కరే తోయిబా ఉగ్రవాది

నీకు ఏం కావాలన్నా అడుగు చేస్తా.. నాకు కావాల్సింది నాకు ఇచ్చేయ్ అంటూ వేధిస్తున్నాడని మహిళా ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు సహకరిస్తే ఉద్యోగం పర్మినెంట్ చేయిస్తానంటూ సత్యనారాయణ  ఆఫర్లు ఇచ్చాడు. క్లర్క్ సత్యనారాయణ వేధింపులు తాళలేక సదరు మహిళా ఉద్యోగి పోలీసులను ఆశ్రయించింది. ఆ మహిళా ఉద్యోగి సత్యనారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. BNS సెక్షన్ 74, 75, 78 కింద కేసు నమోదు చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు