/rtv/media/media_files/2025/03/26/ZwL6oz1ONhfjYvIUOH7S.jpg)
TG Crime bhadrachalam
TG Crime: భద్రాచలం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. బిల్డింగ్ కూలడం చూసి స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. అనంతరం పోలీసులు, అధికారులను సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చెపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా..
స్థానిక వివరాల ప్రకారం.. రామాలయ పరిసర ప్రాంతంలోని సూపర్ బజార్ సెంటర్లో నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించినట్లు తెలుస్తోంది. అనేక మంది కార్యకర్తలు ఈ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా, నాసిరకంగమైన పిల్లర్లతో నిర్మాణం చేపట్టారని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి ఫిర్యాదు చేశారు. ఐటిడి పిఓ రాహుల్ ఈ భవనాన్ని కూల్చివేయమని పంచాయతీ శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: సికింద్రాబాద్‌లో కారు బీభత్సం.. ఇద్దరు స్పాట్ డెడ్!
అయినప్పటికీ ప్రాజెక్టు అధికారి ఆదేశాలను పట్టించుకోకపోవటంతోనే ఈ ప్రమాదం జరిగి పలువురు మరణానికి కారణమైంది. ఇంటి యజమాని సైతం సామాజిక కార్యకర్తలను అనేక రకాలుగా బెదిరించారు. అనేక బిల్డింగు నిర్మాణాలు ఇలాగే నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఫిర్యాదు చేసినా సంబంధించిన శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదానికి పూర్తిగా పంచాయతీ శాఖ బాధ్యత వహించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఈ విత్తనాలు తీసుకుంటే బరువు తగ్గుతారు.. జుట్టుకు కూడా ప్రయోజనం
( ts-crime | ts-crime-news | latest-news | telugu-news)