/rtv/media/media_files/2025/02/19/42AyXr6viTROslT5yBVX.jpg)
KCR Viral Video
KCR VIRAL VIDEO: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ కు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అయితే.. ఈ సందర్భంగా కేసీఆర్ ను చూసేందుకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కేసీఆర్ పార్టీ ఆఫీసులోకి వస్తున్న సమయంలో సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో స్వల్ప తోపులాట సైతం చోటు చేసుకుంది. దీంతో కేసీఆర్ పార్టీ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో ''ఒర్లకండిరా బాబు.. దండం పెడతా'' నంటూ తనదైన శైలిలో కార్యకర్తలను మందలించారు కేసీఆర్. అయినా కార్యర్తలు ఆగకుండా సీఎం అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇది కూడా చదవండి: Eatala Rajender: రేవంత్ పై కాషాయ బుక్.. ఈటల సంచలన ప్రకటన!
తెలంగాణ భవన్ కు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
— BRS Party (@BRSparty) February 19, 2025
అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం. pic.twitter.com/3Bgkx5Vglu
ప్రారంభమైన విస్తృత స్థాయి సమావేశం..
ఇది కూడా చదవండి: KTR Comments: జూపల్లి పదవి ఊస్ట్...కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొనడం జరిగింది. @BRSparty pic.twitter.com/YHB7VTUetT
— Goverdhan Bajireddy (@GovardhanBRS) February 19, 2025
ఇది కూడా చదవండి: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!