కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ అంశంపై మాజీ సీఎం కేసీఆర్ కూడా స్పందించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం మార్ఖత్వపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా ? ఇలాంటి మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అంటూ మండిపడ్డారు. Also Read: ధరణిలో మార్పులు, కొత్త ఆర్‌వోఆర్ చట్టం.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తన ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాయకులకు పలు కీలక సూచనలు చేశారు. '' బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు రావాలి. రాష్ట్రంలో అంశాల వారీగా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. రైతుబంధు తెచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలను అసెంబ్లీలో వివరించారు. అలాగే ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్పూర్తిని వివరించాలి. Also Read: నన్ను బావిలో తొయ్యకు అమ్మ.. కన్నీళ్లు తెప్పిస్తున్న కూతురు మాటలు! కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. మూసీ నది, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరి, గురుకులాలు, విద్యారంగంలో ఉన్న సమస్యలు, వైఫల్యాలపై ప్రశ్నించాలి. నిర్బంధ పాలన గురించి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఆధారంగా వారి వైఫల్యాలు ఎండగట్టాలి. ఫిబ్రవరిలో బహిరంగ సభ నిర్వహించుకుందాం. ఈ సభలో కూడా ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం. ఫిబ్రవరి తర్వాత పార్టీలో అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తాం. కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుదని'' కేసీఆర్ వివరించారు. అయితే కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి వస్తారా ? లేదా ? అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. Also Read: సరిహద్దు భద్రత కోసం యాంటీ డ్రోన్ విభాగం : హోం మంత్రి అమిత్ షా Also Read: అసెంబ్లీలో ఇవి అడగండి.. BRS నేతలకు KCR డైరెక్షన్స్