/rtv/media/media_files/2025/04/01/WMeVov7OKPKcevboRhZb.jpg)
KCR
బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభను ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలో కేసీఆర్ మంగళవారం భేటీ అయ్యారు. రజతోత్సవ సభ కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ సభకు ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలివస్తారన్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్కతుర్తిలో బహిరంగ సభకు భూమి పూజ చేయనున్నట్లు పేర్కొన్నారు.
Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!
బహిరంగ సభకు వచ్చే జనాల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పరిపాలన వింతగా ఉందని కేసీఆర్ అన్నారు. మార్పు కోరుకున్న రైతుల కళ్లల్లో కన్నీళ్లే మిగిలాయని తెలిపారు. రైతులకు ఇలాంటి దుస్థితి వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల రైతులు, వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారంటూ వ్యాఖ్యానించారు.
ఇదిలాఉండగా ఎల్కతుర్తిలో మొత్తం 1214 ఎకరాలు అందుబాటులో ఉంది. ఇందులో 1000కి పైగా ఎకరాల్లో పార్కింగ్, 150 ఎకరాల్లో సభను నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఎండకాలం ఉన్న నేపథ్యంలో బహిరంగ సభకు వచ్చే ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం సభపై నాయకులు దృష్టి పెడుతున్నారు.
Also Read: బంగ్లాలో పడిపోతున్న వస్త్ర పరిశ్రమ..200లకు పైగా ఫ్యాక్టరీలు క్లోజ్
rtv-news | brs | telangana