Telangana jagruthi : ఏప్రిల్ 25న కవిత కొత్తపార్టీ ప్రకటన..పార్టీ పేరు ఏంటంటే?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తను ప్రారంభించబోయే పార్టీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఏప్రిల్‌ 25నపార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 25న పార్టీని లాంఛనంగా ప్రకటిస్తామని ఆమె తెలిపారు.

New Update
FotoJet (14)

Telangana jagruthi :  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తను ప్రారంభించబోయే పార్టీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఏప్రిల్‌ 25నపార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఈ రోజు నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన మిడియా సమావేశంలో ఆమె మట్లాడుతూహైదరాబాద్‌ ORR సమీపంలోని మునీరాబాద్, అద్వయ కన్వెన్షన్ సెంటర్ లో ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు జెండా ఆవిష్కరణ చేసి పార్టీని లాంఛనంగా ప్రకటించనున్నట్లు ఆమె వెల్లడించారు. అదే రోజున కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీ జెండా, ఎజెండా, పార్టీ నిబంధనలను ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే పార్టీ పేరును ‘తెలంగాణ ప్రజా జాగృతి’ గా కవిత వెల్లడించారు.

పార్టీలో యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నామని వెల్లడించారు. సామాజిక సర్వోదయ తెలంగాణ సాధన కోసం కొత్త పార్టీని స్థాపించాల్సిన అవసరం ఏర్పడిందని ఆమె వెల్లడించారు. నీళ్ళు, నిధులు, నియామకాల నినాదాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆ ఆకాంక్షలు నెరవేరలేదని కవిత అభిప్రాయపడ్డారు. ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్న శక్తులు ఇప్పుడు ఈ రాష్ట్రానికి అవసరం ఉందన్నారు. అలాగే ఆడబిడ్డల్లో మార్పు తేవడానికి ఒక మహిళగా ఈ పార్టీని స్థాపించినట్లు తెలిపారు. బీసీ బిల్లు సాధించడం తమ వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. కాగా పార్టీ ప్రకటన చేయనున్న క్రమంలో నిర్వహించునున్న కార్యాక్రమానికి బీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు తరలిరావాలని కవిత పిలుపునిచ్చారు.

అలాగే తాము స్థాపించే పార్టీ ఎవ్వరికీ బీ పార్టీ కాదని మాది నంబర్ వన్ పార్టీ అవుతుందని కవిత అన్నారు. శ్రీరాముడి స్ఫూర్తితో, సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని పని చేస్తామన్నారు. తను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 95 శాతం తెలంగాణ ప్రాంతీయ పార్టీగా, ఇంటి పార్టీగా జాగృతి రాబోతోందన్నారు. ప్రజా సమస్యలపై వెంటపడి అడడమే తమ విధానమన్నారు. ఎంపీ అర్వింద్ మతిమరుపు నాయకుడు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌ల జాప్యానికి నేనే కారణం అన్నారు. ఆయన వచ్చాక ఏం చేస్తున్నారు. అవసరమైతే ఢిల్లీలో లాబీ చేస్తా, గల్లీలో పని చేస్తా’ అని కవిత వివరించారు.

Advertisment
తాజా కథనాలు