కరీంనగర్ మయర్ సునీల్ రావు తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బీఆర్ఎస్ ను విడిచిపెడుతున్నానని...బీజేపీలో చేరతానని ఆయన ప్రకటించారు. రేపు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. కరీంనగర్ అభివృద్ధి కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సునీల్ రావుతో పాటూ మరొ10మంది కార్పొరేటర్లు కూడా బీజేపీలో చేరతారని తెలుస్తోంది.
Also Read: USA: అమెరికాలోనే చరిత్రలోనే అతి పెద్ద ఏరివేత..వైట్ హౌస్
పార్టీకి పెద్ద దెబ్బ...
బీఆర్ఎస్ పార్టీలో సునీల్ రావు కీలక నేత. ఈయన పార్టీ అధినేత కేసీఆర్‌కు సన్నిహితుడు, ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. మరికొన్ని రోజుల్లో కరీంగనర్, నిజామాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో సునీల్ రావు పార్టీని వదిలి పెట్టడం గులాబీ పార్టీకి ఎదురు దెబ్బేనంటూ చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు సునీల్ రావుకు బుజ్జింగిపుల పర్వం మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి పార్టీకి రాజీనామా చేయొద్దని అడిగినట్లు తెలుస్తోంది. భవిష్యత్ బీఆర్ఎస్దేనని.. మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని ధైర్యం చెప్పారని సమాచారం. అలాగే భవిష్యత్లో మంచి పదవులు లభిస్తాయని భరోసా ఇచ్చారని కూడా చెబుతున్నారు.
Also Read: Crime: మేడ్చల్ యువతి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు..