జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. జగిత్యాల సభలో జీవన్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. "75 ఏళ్ల వ్యక్తికి 25 ఏళ్లు తగ్గిపోయాయని, ఆయన యువకుడని కేసీఆర్ అనడం హాస్యాస్పదం. 75 ఏళ్ల వ్యక్తి యువకుడైతే, మరి రాష్ట్రంలోని అసలైన యువకులందరూ ఏమవ్వాలి? వారంతా చచ్చిపోయారా?" అని ఆమె నిలదీశారు.
జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని కవిత ఆరోపించారు. వైఎస్ ఉంటే తెలంగాణ ఎందుకన్న వ్యక్తి జీవన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. ఉద్యమకారుల గురించి కేసీఆర్ ఆ సభలో ఒక్క మాట కూడా మాడ్లాకపోవడం దారుణమన్నారు కవిత. సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ పల్లెత్తి మాట అనకపోవడం వెనుక లోపాయికారీ ఒప్పందం ఉందని కవిత ఆరోపించారు.
మహిళలకు గౌరవం ఉండదు
ఇక బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు గౌరవం ఉండదని కవిత విమర్శించారు. ఓటమికి ప్రజలనే తప్పుబట్టడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. "మమ్మల్ని ఓడించి తప్పు చేశారని ప్రజలను అనడం సరికాదు. ఎన్ని ఏళ్లయినా బీఆర్ఎస్ మారదు. ఉద్యమకారులను విస్మరించి కేవలం స్వార్థ రాజకీయాల కోసమే ఆ పార్టీ పనిచేస్తోంది" అని ఆమె ఆరోపించారు.
తెలంగాణలో కొత్త రాజకీయ శకం మొదలవుతోందని ప్రకటిస్తూ, తన కొత్త పార్టీ ఆవిర్భావ సభ వివరాలను కవిత వెల్లడించారు. ఏప్రిల్ 25వ తేదీన మేడ్చల్ జిల్లా, ఓఆర్ఆర్ (ORR) ఎగ్జిట్-6 సమీపంలో భారీ బహిరంగ సభతో తమ కొత్త రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెడుతున్నామని వెల్లడించారు. ప్రజల కష్టాలను తీర్చే దిశగా కొత్త రాజకీయ ప్రయాణం ఉంటుందని కవిత చెప్పుకొచ్చారు. కొత్త పార్టీ వస్తున్న నేపథ్యంలో పబ్లిసిటీ మెటీరియల్‌కు ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని జీహెచ్ఎంసీ అధికారులను ఆమె కోరారు.. ప్రజల పక్షాన నిలబడటమే తమ పార్టీ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. తమ రాబోయే పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని, వారికి అద్భుతమైన అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా కవిత హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని కవిత ప్రకటించారు. "ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతోంది. అటు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది, రాష్ట్రంలో మక్కలు (మొక్కజొన్న) కొనే దిక్కు కూడా లేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు..
Kavitha : జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. కేసీఆర్ సభపై కవిత సెటైర్లు!
జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. జగిత్యాల సభలో జీవన్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు.