/rtv/media/media_files/2025/03/17/4yiwHEsWvT1SP2H32GKD.jpg)
kajal promoting betting app
Betting Apps: రూల్స్ సామాన్యులకేనా? లేదా సెలెబ్రెటీలకు కూడానా? వాళ్ళను మీరు అరెస్ట్ చేయగలరా? అంటూ @SajjanarVCకి సవాల్ విసిరాడు ఓ నెటిజన్. అయితే ఏపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ రాష్ట్రంలో ఎంతో మంది యువత చావులకు కారణమైన బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న వారికి దడపుట్టిస్తున్నారు. ఇప్పటికే ఫ్లుయెన్సర్ల పేరుతో బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న పలువురు యూట్యూబర్లపై యాక్షన్ తీసుకున్నారు.
Also Read: Suma Chaaaat Show: తమన్ చాట్ ఛాలెంజ్.. సుమ కంటెస్ట్ లో విన్ అవ్వడానికి ఇలా చేయండి?
కాజల్ బెట్టింగ్ యాప్ వీడియో..
ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ కాజల్ గతంలో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్న వీడియో బయట పడింది. దీంతో ఓ నెటిజన్ ఈ వీడియోను వీసీ సజ్జనర్ కి ట్యాగ్ చేస్తూ సవాల్ విసిరాడు. @సజ్జనార్‌విసి, @APPOLICE100.. మరి ఇప్పుడు కాజల్ అగర్వాల్ ని అరెస్ట్ చేయగలరా? సెలబ్రెటీలకు సామాన్యుడికి ఎప్పుడూ ఈ పక్షపాతం ఎందుకు? అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశాడు. మరి దీనిపై వీసీ సజ్జనార్ ఎలా స్పందిస్తారో చూడాలి.
pic.twitter.com/p13rZnDQlR dear .@SajjanarVC .@APPOLICE100 do you have guts to arrest .@MsKajalAggarwal ?
— AI Vanguard (@YsJaganTweets) March 16, 2025
Why always partiality to common man to celebraties?#equalrights #EqualJustice
ఇప్పటికే పలువురిపై కేసులు
ఇప్పటికే హర్ష సాయి, సన్ని యాదవ్, లోకల్ బాయ్ నానిలపై కేసులు నమోదవగా.. త్వరలోనే పరేషాన్ బాయ్స్, వినయ్ కుయ్యా, బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ పైనా కేసులు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యువత జీవితాలను నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై సీరియస్ ఫోకస్ పెట్టిన సజ్జనార్ తరచూ సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన అవేర్నెస్ వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు. బెట్టింగ్ యాప్ లు కేవలం ఒక వ్యక్తిగత ప్రమాదం మాత్రమే కాదు. దేశ భవిష్యత్తును క్షీణింపజేస్తుందని తెలిపారు. ఎవరైనా బెట్టింగ్ యాప్ ల వల్ల నష్టపోతే వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Also Read: Betting apps: పల్లవి ప్రశాంత్‌కు బిగ్ షాక్.. వీడియో బయటపెట్టిన అన్వేష్.. సజ్జనార్ యాక్షన్!