/rtv/media/media_files/2025/02/10/1U2rso3qnIQ6ATpM6jIM.jpg)
KA Paul respond about CHILUKURI Balaji Temple Chief Priest attack
KA Paul: హైదరాబాద్ చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్(CS Rangarajan)పై జరిగిన దాడి(Attack on Chilkur Balaji Temple Priest)ని కేఏపాల్ ఖండించారు. చర్చిల్లో ఫాస్టర్లను, మసీదుల్లో ములాసన్ న్, రామరాజ్యం సైన్యం రాముడిపేరుతో ఒక అర్చకుడిని కొట్టడం దారుణం అన్నారు. 22 మంది దుండగులపై కేసులు పెట్టి బెయిల్ రాకుండా జైల్లో వేయాలన్నారు. కఠిన శిక్షలు వేస్తేనే ఇలాంటి దారుణాలు మరోసారి జరగవన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), తెలంగాణ డీజీపీ(Telangana DGP) తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇలాంటి అల్లరి మూకలు రెచ్చిపోతాయని, ఒకరినొకరు చంపుకు చస్తారని, ప్రపంచంలో శాంతి లేకుండా పోతుందన్నారు.
Also Read: ఢిల్లీ ఫలితాలపై కోమటిరెడ్డి రియాక్షన్.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!
ఎంత దారుణం ఇది.. రాముడి పేరు చెప్పి ఒక పూజారిపై దాడి చేస్తారా..?
— RTV (@RTVnewsnetwork) February 10, 2025
రేవంత్ రెడ్డి వాళ్లపై నాన్ బెయిల్ కేసు పెట్టి బొక్కలో వేయించు..
చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి ఘటనపై కేఏ పాల్ కామెంట్స్.. #Rangarajan #KAPaul #chilukurubalajitemple #RTV pic.twitter.com/ychlP5RFjO
Also Read: వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?
పవన్(Pawan Kalyan) ఫైర్..
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇది ఒక వ్యక్తిపై కాదని.. ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు. చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానన్నారు. దురదృష్టకరమైన ఘటన ఇదన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా- ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలన్నారు.
Also Read: HAJJ 2025: హజ్ యాత్రకు వెళ్లే ఇండియన్స్‌కు బిగ్ షాక్.. మారిన రూల్స్!
కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారన్నారు. రామరాజ్యం(Ramarajyam) అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్ళిన ఒక మూక రంగరాజన్ పై దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలన్నారు. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. ఈ దాడిని తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. సనాతన ధర్మ(Sanathana Dharma) పరిరక్షణ కోసం పలు విలువైన సూచనలను రంగరాజన్ తనకు అందించారన్నారు. టెంపుల్ మూమెంట్(Temple Moment) అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియచేశారని గుర్తు చేశారు.
Also Read: Drugs: షాకింగ్ న్యూస్.. డ్రగ్స్ పెంచి పోషించిన ప్రధాని.. 50 వేల మంది మృతి!