Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌..

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆయనకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్‌ అరాధే బాంబే హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు.

New Update
Justice Sujoy paul

Justice Sujoy paul

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆయనకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్‌ అరాధే.. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 

సుజయ్ పాల్ ఎవరు  ? 

జస్టిస్ సుజయ్ పాల్ 1964 జూన్ 21న జన్మించారు. బీకాం, ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన ఆయన 1990లో మధ్యప్రదేశ్‌లోని బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. వివిధ బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, బోర్డులకు సుజయ్ పాల్ సేవలందించారు. 2011 మే 27న ఆయన మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

Also Read: హమాస్‌- ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం !

అలాగే 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుతో 2024 మార్చి 21న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అయితే తాజాగా ఆయనకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం వచ్చింది. సుజయ్‌ పాల్‌ చీఫ్ జస్టీస్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ముర్మూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Also Read: నీ గూగుల్ సెర్చ్‌కు గత్తర రాను.. చావు తర్వాత ఏమిటని వెతికి..!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు