/rtv/media/media_files/2026/04/24/fotojet-2026-04-24-13-47-37.jpg)
preethi reddy
BIG BREAKING : మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు, డాక్టర్ ప్రీతిరెడ్డి బిజెపి రాష్ట్ర కార్యాలయానికి రావడం సంచలనంగా మారింది. అంతేకాదు ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అయితే బయట ప్రచారం జరుగుతున్నట్లు గా ఆమె పార్టీలో చేరుతున్నారా? అన్న సందేహాలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు ఆర్టీవీతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.
➤ RTVతో మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి ప్రత్యేక చిట్‌చాట్
— RTV (@RTVnewsnetwork) April 24, 2026
➤ మా ఈవెంట్‌కు ప్రధాని మోదీ వస్తున్నారు.. అందుకే ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్లాం
➤ ప్రధాని మోదీతో ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదు.. కేవలం అభివృద్ధిపైనే చర్చించాం
➤ మోదీతో రాజకీయాలు మాట్లాడాలంటే భయం.. ఆయన కూడా… pic.twitter.com/S8ZHeUzVB1
మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి తాజాగా బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తన పర్యటన వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు.తమ విద్యాసంస్థల ఈవెంట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తున్నామని, ఆ ఈవెంట్ ఏర్పాట్ల విషయంలో బిజెపి ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీకి ఇన్విటేషన్ ఇవ్వడానికే ఇక్కడికి వచ్చానని ఆమె స్పష్టం చేశారు."మోదీతో ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదు. కేవలం అభివృద్ధిపై మాత్రమే చర్చించాం. ఆయనతో రాజకీయాలు మాట్లాడాలంటే భయం వేస్తుంది, అయినా ఆయన ఇలాంటి విషయాలను ఎంటర్టైన్ చేయరు." అని ఆమె పేర్కొన్నారు.
భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా? అన్న ప్రశ్నకు ఆమె ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. "భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మాత్రం కేవలం ఇన్విటేషన్ ఇవ్వడానికే బిజెపి ఆఫీస్‌కు వచ్చాను. ఇక్కడికి వస్తే పార్టీలో చేరుతున్నట్టు కాదు" అని తేల్చి చెప్పారు. అలాగే హిందూ మహిళగా తన హక్కులను, ఆచారాలను ఆమె సమర్థించుకున్నారు. "ఒక హిందూ మహిళగా నేను బతుకమ్మ, బోనాలు చేయకూడదా? ఒక మహిళగా నేను అన్ని పండుగలను మనస్ఫూర్తిగా జరుపుకుంటాను." అన్నారు. గతంలో బోనాల సమయంలో బండి సంజయ్‌కు గౌరవం ఇవ్వడంపై స్పందిస్తూ.. ఆయనను డిస్‌రెస్పెక్ట్ చేయకూడదనే ఉద్దేశంతోనే గౌరవించానని చెప్పారు. నేషనల్ సాంగ్ వందేమాతరం అందరూ పాడాలని, అందులో తప్పేముందని ఆమె ప్రశ్నించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ పేరు మార్పుపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ పేరు మార్పు విషయంలో ప్రీతిరెడ్డి తన గళాన్ని వినిపించారు."పాకిస్తాన్‌లో కూడా ఒక 'హైదరాబాద్' ఉంది. అందుకే మన దగ్గర ఉన్న నగరం పేరును 'భాగ్యనగర్'గా మార్చాలని నేను కోరుతున్నాను." అన్నారు. విద్యా వ్యవస్థ అభివృద్ధిలో అన్ని రాజకీయ పార్టీల అవసరం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.బిజెపి నినాదమైన 'నేషన్ ఫస్ట్' అనేది నిజం కాదంటూ ఆమె తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకున్నారు.ప్రస్తుతానికి ఆమె రాక కేవలం ఆహ్వాన పత్రిక అందజేయడానికే అని చెబుతున్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం ఆమె భవిష్యత్తు అడుగులపై చర్చ మొదలైంది.
Follow Us