Instagram Blackmail Trap Case : ఆజాద్‌ పేరిట జాదు లీలలు..సంచలన విషయాలు వెలుగులోకి..

సోషల్ మీడియా మాయాజాలంలో చిక్కుకుని యువత ఏ విధంగా పెడదారి పడుతున్నారో చెప్పేందుకు కొండూరి చంద్రశేఖర్ ఆజాద్ ఉదంతం ఒక హెచ్చరిక లాంటిది. ధనిక వర్గాలకు చెందిన యువతులను లక్ష్యంగా చేసుకుని 'ఎస్కార్ట్', 'సిట్యువేషన్‌షిప్' వంటి ముసుగుల్లో వారిని నిలువునా ముంచాడు.

New Update
FotoJet - 2026-05-02T121033.822

Konduri Chandrashekhar Azad @ arjun

Instagram Blackmail Trap Case : సోషల్ మీడియా మాయాజాలంలో చిక్కుకుని యువత ఏ విధంగా పెడదారి పడుతున్నారో చెప్పేందుకు కొండూరి చంద్రశేఖర్ ఆజాద్ ఉదంతం ఒక హెచ్చరికగా నిలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఖరీదైన కార్లు, స్టైలిష్ ఫోటోలు, రోమాంటిక్ రీల్స్‌తో ఆడంబరమైన జీవితాన్ని ప్రదర్శిస్తూ, తాను ఒక పెద్ద స్టార్టప్ కంపెనీ యజమానినని నమ్మించి అమ్మాయిలను ఆకర్షించడమే ఇతని ప్రధాన వృత్తి. కేవలం విలాసాల కోసమే కాకుండా, పక్కా ప్రణాళికతో ధనిక వర్గాలకు చెందిన యువతులను లక్ష్యంగా చేసుకుని 'ఎస్కార్ట్', 'సిట్యువేషన్‌షిప్' వంటి ముసుగుల్లో వారిని నిలువునా ముంచేవాడు.

చంద్రశేఖర్ ఆజాద్‌ అలియాస్ అర్జున్ మోసాల తీరు అత్యంత క్రూరంగా ఉండేది. బీటెక్ పూర్తి చేసిన ఇతడు, డబ్బు సంపాదన కోసం ఏ గడ్డి తినడానికైనా సిద్ధపడ్డాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 150 మంది ధనిక యువతులతో స్నేహం చేస్తూ, వారిని తన మాయమాటలతో బుట్టలో వేసుకునేవాడు. ఒకవేళ ఎవరైనా యువతులు తన వికృత కోరికలకు లొంగకపోతే, వారిని ప్రేమ పేరుతో వంచించి శారీరక సంబంధం పెట్టుకుని, ఆపై బ్లాక్‌మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేసేవాడు. జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి, జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి మార్చుకోకుండా మళ్లీ ఆమె దగ్గరే రూ. 13 లక్షలు కాజేయడం ఇతని నేర ప్రవృత్తికి అద్దం పడుతోంది.

ఈ మొత్తం వ్యవహారంలో చంద్రశేఖర్ ఒంటరిగా కాకుండా, కుటుంబ సభ్యుల అండదండలతోనే ఈ దందాను నడిపించినట్లు విచారణలో వెల్లడి కావడం విస్మయానికి గురిచేస్తోంది. తండ్రి లేని ఇతడు తల్లి మీనాకుమారి, మేనమామ పర్యవేక్షణలోనే పెరిగాడు. బాధితుల నుంచి వసూలు చేసిన లక్షలాది రూపాయలు తల్లి బ్యాంకు ఖాతాలోకి జమ కావడంతో, ఇతడి వికృత చేష్టలు ఆమెకు ముందే తెలుసని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కొడుకు చేస్తున్న తప్పులను వారించాల్సింది పోయి, ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న తల్లి, మేనమామపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, స్వయంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితుడిని విచారించారు. చంద్రశేఖర్ బాధితుల జాబితా చాలా పెద్దగానే ఉన్నప్పటికీ, పరువు పోతుందనే భయంతో చాలా మంది ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కనిపించే ఆడంబరాలను చూసి మోసపోవద్దని, ఇటువంటి సైకో నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న నిందితుడి నుంచి మరిన్ని కీలక విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు