/rtv/media/media_files/2025/12/09/global-summit-telangana-2025-12-09-09-08-14.jpg)
Investments Worth Rs. 3,97,500 Crore
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్(Telangana Rising Global Summit 2025) డిసెంబర్ 08న ప్రారంభమైంది. సదస్సు తొలి రోజైన సోమవారం రూ.3,97,500 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సమిట్ ప్రాంగణంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో కంపెనీల ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్(CM Revanth) మాట్లాడుతూ... 2047 విజన్ కోసం తాము సాంకేతికత, సుస్థిరతపై వ్యూహాత్మకంగా దృష్టి పెట్టామని తెలిపారు. దీన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ పెట్టుబడులు... ఉద్యోగాల సాధనలో, ప్రపంచస్థాయి మౌలిక వసతుల్లో దేశ ఆర్థిక ప్రయాణానికి తెలంగాణ నాయకత్వం వహించేందుకు ఉపకరిస్తాయని పేర్కొన్నారు.
Also Read : తెలంగాణలో ట్రంప్ కంపెనీ రూ.లక్ష కోట్ల పెట్టుబడి.. ఆ సంస్థ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Also Read : మూడు జోన్లుగా తెలంగాణ.. గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ కీలక ప్రకటన
Follow Us