/rtv/media/media_files/2025/02/13/K47EDPFRyoyjZGoXrBbh.jpg)
Indiramma Houses
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లు ఎప్పుడు మంజూరు చేస్తారా అని లబ్దిదారులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వాళ్లకి మరో గుడ్‌న్యూస్ అందింది. మార్చి నుంచి ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల లిస్టును తయారుచేశారు. అలాగే ఇళ్ల గ్రౌండింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత ఆయా గ్రామాల్లో ప్రీ-గ్రౌండింగ్ సమావేశాల ఏర్పాటుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది.
Also Read: పార్లమెంటులో కొత్త ఐటీ బిల్లు-2025ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
మూడు జాబితాలుగా దరఖాస్తులు..
మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు మూడు జాబితాలుగా విభజించారు. సొంతంగా ఇంటి స్థలాలు ఉండి ఇళ్లు లేని వాళ్లని L-1 జాబితాలో చేర్చారు. సొంత స్థలం ఉండి గుడిసె, పూరిపాక, మట్టిమిద్దెలు, రేకుల ఇళ్లు ఉన్నవాళ్లని కూడా ఈ జాబితాలోనే చేర్చారు. సొంత స్థలం లేని వాళ్లని L-2 జాబితాలో చేర్చారు. వీళ్లందరూ కూడా స్థలంతో పాటు ఇళ్లు లేనివారే. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేసుకున్న వాళ్లని L-3లో చేర్చారు.
Also Read : ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు
ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన అప్లికేషన్లలను కుటుంబ సర్వే, యాప్ సర్వే ఆధారంగా విభజించారు. దీనిప్రకారం చూసుకుంటే L-1లో 21.93 లక్షలు, L-2లో 19.96 లక్షలు, L-3లో 33.87 లక్షల దరఖాస్తులను చేర్చారు. GHMCలో ఇంకా 2.43 లక్షల ఇళ్లను పరిశీలించాల్సి ఉంది. అయితే మొదటి విడతలో ఇప్పటికే 562 గ్రామాల నుంచి 71,482 మందిని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా ప్రభుత్వం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీళ్లలో ఎల్ 1 నుంచి 59,807 మంది, ఎల్-2 నుంచి 1,945 మంది, ఎల్-3 నుంచి 5,732 మందిని, కొత్త దరఖాస్తుల నుంచి 3,998 మందిని లబ్ధిదారులుగా సెలెక్ట్ చేశారు.
Also Read: ఆపరేషన్ కగార్...100 మంది మహిళా మావోయిస్టులు హతం
మొదటి విడుతలో చూసుకుంటే సొంత స్థలం ఉన్నవాళ్లకే ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ క్రమంలోనే ఎల్ నుంచి ఎక్కువగా 59,807 మందిని ఎంపిక చేసింది. ఎల్-2, ఎల్-3 జాబితాలు, కొత్తగా వచ్చిన దరఖాస్తుదారుల నుంచి 11,675 మందిని ఎంపిక చేసింది. మిగతా విడతల్లో ఎల్-1, ఎల్-2లో మిగిలిన వాళ్లకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎల్-3లో చూసుకుంటే 33.87 లక్షల మంది లబ్ధిదారుల్లో అత్యధిక శాతం ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు కానట్లుగా సర్కార్ గుర్తించినట్లు తెలుస్తోంది.
Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!