/rtv/media/media_files/2025/02/06/SBTbJvNkbYsThpy5hGSt.webp)
STUDENT SUICIDE
Telangana Gurukulam: తెలంగాణలోని ప్రభుత్వ(Telangana Government) గురుకుల పాఠశాలల్లో గత కొంతకాలంగా విద్యార్థిని, విద్యార్థులు అనుమానస్పదంగా మృతి చెందుతున్నారు. ఒకవైపు ఫుడ్ పాయిజన్(Food Poisoning) తో వరుసగా విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే... మరోపక్క అనుమానస్పద మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాలు మృత్యుకుహరాలుగా మారాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా(Mahabubnagar District)లో మరో విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మరణించింది.
Also Read : తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం
అనుమానస్పద రీతిలో ఆత్మహత్య..
రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల వరుస మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న పలు గురుకులాల్లో పలువురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. పాముకాట్లు, ఫుడ్ పాయిజన్, సూసైడ్స్ దితర కారణాలతో ఎందరో విద్యార్థులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతోమంది విద్యార్థులు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో గురుకుల విద్యార్ధిని అసువులు బాసింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని గురుకులంలో గురువారం రోజున ఓ విద్యార్థిని అనుమానస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడింది.
Also Read : కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన ఆరాధ్య బాలనగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆరాధ్య జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ గురుకుల హాస్టల్లో ఉంటోంది. అందరితో కలివిడిగా ఉండే ఆరాధ్య క్లాస్ రూంలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం 6:30 గంటలకు ఆరాధ్య సీలింగుకు వేలాడుతూ కనిపించే సరిగి తోటివిద్యార్థులు భయంతో కేకలు వేశారు. గమనించిన టీచర్లు అంతా కలిసి హుటాహుటిన షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే విద్యార్థిని మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. తమతో కలసి ఉండే ఆరాధ్య లేదనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు.ఆరాధ్య మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ విద్యార్ధిని బంధువులు గురుకుల పాఠశాలఎదుట ఆందోళన చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెళ్లడిస్తామని తెలిపారు.
Also Read : వివేక్ కుట్రతో మాదిగలకు మళ్లీ అన్యాయం.. వర్గీకరణ ఇలా చేస్తారా?: మందకృష్ణ సంచలన ప్రెస్ మీట్!
Also Read : తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం