/rtv/media/media_files/2025/03/27/sGIe0w0WKMSRQNBHd2P7.jpg)
CM Revanth Reddy Vs KTR
CM Revanth Reddy Vs KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడైనా వందశాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా అని ప్రకటించారు. తన నియోజకవర్గమైన సిరిసిల్లకైనా, సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌కు అయినా వెళ్దాం.. నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో అయినా సరే 100% రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే అక్కడే క్షణం ఆలోచించకుండా రాజీనామా చేస్తా అని సవాల్ చేశారు. అంతేకాదు.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also read: Google: గుట్టుచప్పుడు కాకుండా గూగుల్ మీ ప్రతీ మాట వింటోంది.. ఇలా చెక్ పెట్టండి!
కాంగ్రెస్ ప్రభుత్వంఅధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు ఎవరూ సంతోషంగా లేరని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అతి తక్కువ సమయంలోనే చాలా అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. సంక్షేమంలో మానవీయ కోణాన్ని, అభివృద్ధిలో ప్రణాళికాబద్ధమైన దృక్పథాన్ని కలిపి కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని తెలిపారు. పరిపాలనలో కొత్త ఒరవడి, ప్రణాళికా రూపకల్పనలో వినూత్న విధానాలను అనుసరించడం వల్లే తెలంగాణ ముఖచిత్రం పూర్తిగా మారిందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని వివరించారు. 2014 నుంచి 2022 వరకూ రాష్ట్రాల ఆదాయాలను పరిశీలిస్తే, తెలంగాణ స్వయం సమృద్ధి కలిగిన రాష్ట్రంగా ఎదిగిందని కేటీఆర్ తెలిపారు.
Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
ప్రతిదానికి ప్రభుత్వం రాష్ట్రం అప్పుల పాలైందనడం సరికాదని అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైంది అనడానికి ఆధారాలు ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత పదేళ్ళలో ఏమీ చేయకుండానే రాష్ట్రంలో సంపద పెరిగిందా అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు సగటు ఆదాయం రూ. 3500 కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.18 వేల కోట్లు ఉందన్నారు. అప్పులకు రెట్టింపు సంపద పెరిగిందని తెలియజేశారు.
Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
అమెరికా లాంటి దేశాలకు కూడా అప్పులు ఉంటాయని, అప్పులు లేని దేశం గాని రాష్ట్రం గాని ఉండవన్నారు. అమాటకొస్తే అప్పులు లేని మనిషి కూడా ఉండడని.. ఈ సభలో ఉన్నవారికి కూడా అప్పులు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, భట్టి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. "అప్పులు లేని వాళ్ళు ఈ సభలో ఎవరైనా ఉన్నారా?" అని కేటీఆర్ ప్రశ్నించగా.. దానికి భట్టి విక్రమార్క"నాకు లేవు" అన్నారు. అందుకు కేటీఆర్ "మీరు గ్రేట్ భట్టి గారు, రాష్ట్రానికి ఆర్థికమంత్రి కదా అలాగే ఉండాలి.." అనడంతో సభలో కొద్దిసేపు నవ్వులు విరిశాయి.
Also Read: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!
MLA Raja Singh : ఒవైసీ బ్రదర్స్‌ను కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్
ఒవైసీ బ్రదర్స్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒవైసీ బ్రదర్స్‌ను...కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ముస్లింలను ఒవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు.
ఒవైసీ బ్రదర్స్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒవైసీ బ్రదర్స్‌ను... కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ముస్లింలను ఒవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు. ఒవైసీ బ్రదర్స్ ముస్లింల ఆస్తులను దోచుకున్నారని.. వారి అరుపులకు ఎవరు భయపడరంటూ రాజాసింగ్ కీలక కామెంట్స్ చేశారు.
Also Read : ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మూడేళ్లలో మీరే కోటీశ్వరులు
Also Read : తాబేలు ఎంత పని చేసింది భయ్యా.. బికినీ పాపకు చుక్కలు చూపించిందిగా!
ముస్లింలకు వ్యతిరేకం కాదు
వక్ఫ్ బోర్డ్ పేరుతో ఒవైసీ బ్రదర్స్ ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయని రాజాసింగ్ అన్నారు. బోర్డు రాకముందు 4 వేల ఎకరాలుంటే.. బోర్డును అడ్డం పెట్టుకుని 9లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డ్ ముస్లింలకు వ్యతిరేకం కాదని.. వారి ఆస్తులకు మోడీ రక్షణ కల్పిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఇది మోడీ భారత్ అని అన్నారు.
Also read : Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు
Also Read : ఆ నలుగురి స్టార్లతో కలిసి ఆడాలని ఉంది.. మనసులో మాట చెప్పేసిన ధోనీ
bjp | owaisi-brothers | telugu-news | mla raja singh | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates
సెన్సెక్స్ భారీగా పతనం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Lemon: సమ్మర్ ఎఫెక్ట్.. వాచిపోతున్న నిమ్మకాయల ధరలు.. పిండితే రసం కూడా రావట్లే!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలు!
ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మూడేళ్లలో మీరే కోటీశ్వరులు
Pimples: వీపు మీద మొటిమలు రావడానికి కారణం ఏమిటి?