Khammam: ఆడపిల్ల పుడితే "స్వీట్ బాక్స్''...ఎక్కడో తెలుసా?

కొంతమంది ఆడపిల్ల పుడితే ఆ ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోతుంటారు. కానీ..ఇప్పటికీ ఆడపిల్ల పుట్టిందని ఆ పసిగుడ్డును తీసుకెళ్లి ఏ చెత్తకుప్పల్లోనో, ఏ ముళ్లకంపల్లోనో పడేస్తున్నారు. కానీ ఆ జిల్లా కలెక్టర్‌ స్వీట్‌బాక్స్‌ ఇచ్చి అభినందిస్తున్నారు.

New Update
sweet box

sweet box

Khammam :  కొంతమంది  ఆడపిల్ల పుడితే ఆ ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందంటూ మురిసిపోతుంటారు. కానీ.. ఇప్పటికీ ఆడపిల్ల పుట్టిందని రక్తపు మరకలు ఆరకముందే ఆ పసిగుడ్డును తీసుకెళ్లి ఏ చెత్తకుప్పల్లోనో, ఏ ముళ్లకంపల్లోనో పడేస్తున్న సందర్భాలు లేకపోలేదు. సమాజంలో ఎన్ని మార్పులు వచ్చిన ఆడ,మగ అనే తేడా అనే విషయంలో మాత్రం ఇంకా మార్పు రాలేదు. అందుకే ఆడపిల్ల పుడితే ఆ జిల్లా కలెక్టర్‌ స్వీట్‌బాక్స్‌ ఇచ్చి అభినందిస్తున్నారు.


 ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి  

ఖమ్మం నగరంలో ఓ రోజు ఓ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తుండటాన్ని ఆస్పత్రి నర్సులు గమనించారు. ఆ చిన్నారి దగ్గరికి వెళ్లి.. చుట్టూ గమనించారు. ఆ పసిగుడ్డు ఎవరి పాప అని ఆరా తీశారు. ఫలితం లేకపోయింది. ఎందుకంటే.. ఆడపిల్ల పుట్టిందని చెప్పి.. కళ్లు కూడా పూర్తిగా తెరవని ఆ చిన్నారిని ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిపోయారు.  అక్కడ ఎవరినీ అడిగినా తల్లి జాడ తెలియలేదు. దీంతో  ఆ పాపను ఖమ్మంలోని శిశుగృహానికి తరలించారు. కాగా.. ఇలాంటి ఘటనలు వరుసగా జరగ్గా.. అవి కాస్త కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ దృష్టికి వచ్చాయి. దీంతో.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు.. కలెక్టర్ సరికొత్త ఆలోచన చేశారు.

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

ఆడపిల్ల పుడితే అవమానంగా కాదు కుటుంబానికి గౌరవంగా భావించాలన్న ఉద్దేశంతో.. "గర్ల్ ప్రైడ్" పేరుతో సరికొత్త కార్యక్రమానికి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లాలో ఏ కుటుంబంలో ఆడపిల్ల పుట్టినా.. ఆ ఇంటికి జిల్లా అధికారులు వెళ్లి.. స్వీట్ బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.. నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని.. అమ్మాయి పుట్టడం శుభసూచకమని ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకే తాను ఈ కొత్త పథకాన్ని ప్రారంభించినట్టు ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌ వివరించారు. వచ్చే వారం నుంచే ఈ గర్ల్ ప్రైడ్ కార్యక్రమం కోసం జిల్లా అధికారుల పర్యటనలను ప్రారంభించున్నట్టు స్పష్టం చేశారు.

 Also read: MMTS Train Incident: హైదరాబాద్ దారుణం.. MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం

ఆడపిల్లల పట్ల సమాజంలో ఉన్న పక్షపాత ధోరణిని దూరం చేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. కుటుంబంలో, సమాజంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఆడపిల్లల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు.. సామాజిక దృక్పథాన్ని మార్చేందుకు తాను ఈ కొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్నానని వివరించారు. ఆడపిల్ల జన్మించడం ఆ తల్లిదండ్రులకు, కుటుంబానికి గర్వకారణంగా భావించేలా, పాప పుడితే పండుగ చేసుకోవాలన్న ఉదేశంతోనే ఈ స్వీట్ బాక్సులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు.. వారివారి ఇళ్లకు స్వీట్ బాక్సును అధికారులతో పంపించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.

Also read: SRH mems: SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్

ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిల్లలు పుట్టిన తర్వాత సర్కార్ నుంచి కిట్‌ను అందిస్తున్నారు. ఈ కిట్‌లో పిల్లలకు అవసరమయ్యే బట్టలు, నూనె, క్రీమ్, పౌడర్ లాంటివి ఉంటాయి. ఇలా అందించడం వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన పిల్లలకు వారి తల్లి అకౌంట్లలో నగదు జమ చేస్తోంది.

Also Read: Tech Mahindra: ఖతార్ లో గుజరాత్‌ కి చెందిన టెక్ మహీంద్రా ఉద్యోగి అరెస్ట్

Advertisment
Advertisment
Advertisment