/rtv/media/media_files/2025/02/20/E0wWMQJy93O4yntEvOmZ.jpg)
HYDRAA New Jobs
HYDRAA Jobs: డీఆర్ఎఫ్ (Disaster Response Force) లోకి ఔట్ సోర్సింగ్(Outsourcing Jobs) విధానంలో కొత్తగా 357 మందిని నియమించారు. వారి శిక్షణ ప్రారంభోత్సవంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్రాలో డీఆర్ఎఫ్ పాత్ర కీలకమన్నారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. హైడ్రా నిర్వహిస్తున్న విధులన్నిటిలో డీఆర్ఎఫ్ బృందాల పాత్ర చాలా కీలకమైనదన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అంచనాల మేరకు హైడ్రా పని చేయాల్సినవసరం ఉందన్నారు. ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంబర్‌పేట్ పోలీసు శిక్షణా కేంద్రంలో వారం రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుందన్నారు. ఈ సమాజంలోనూ.. ప్రభుత్వ పరంగా హైడ్రా ప్రధానమైన భూమిక పోషిస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read: ఇంత పిరికోడివి ఏంట్రా.. ప్రేమ, పెళ్లన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి పారిపోయాడు!
డీ ఆర్ ఎఫ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు.@TelanganaCMO #HYDRAA pic.twitter.com/qwH7SGkmH8
— HYDRAA (@Comm_HYDRAA) February 20, 2025
ప్రకృతి వైపరీత్యాల సమయంలో డీఆర్ఎఫ్(Disaster Response Force) పాత్ర కీలకం..
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలతో పాటు.. ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో డీఆర్ఎఫ్ పాత్ర చాలా కీలకమైనదన్నారు. ఇప్పుడు హైడ్రా విధులు కూడా తోడయ్యాయన్నారు. మన మీద ఉన్న నమ్మకంతో ప్రభుత్వం పలు బాధ్యతలు అప్పగిస్తోందన్నారు. తాజాగా ఇసుక అక్రమ రవాణాను నియంత్రించే పనిని కూడా హైడ్రాకు కేటాయించిందన్నారు. వీటన్నిటినీ ఎంతో శ్రద్ధగా, బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read: కుంభమేళాలో జాగ్రత్త.. మల కోలిఫాం బ్యాక్టీరియా ఎంత డేంజరస్ అంటే..!
పోలీసు పరీక్ష రాసి.. కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం పొందలేని వారి మెరిట్ లిస్టు ఆధారంగా.. సామాజిక అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ 357 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంతో పారదర్శకంగా ఈ ఎంపిక జరిగిందన్నారు. ప్రస్తుతం తరుణంలో ఉద్యోగాలకు ఎంతో పోటీ ఉందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ప్రతిభ కనబర్చాలన్నారు.
Also Read: BIG BREAKING: వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ.. హైకోర్టు బిగ్ షాక్!
అప్పుడే మరిన్న మంచి అవకాశాలుంటాయన్నారు. ఈ 357 మంది శిక్షణ తర్వాత మరో కొత్త బ్యాచ్ వస్తుందన్నారు. కొత్తగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లో చేరిన సిబ్బంది భారీ వర్షాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు అండగా ఉండేలా.. ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేలా నిపుణులతో శిక్షణ ఇస్తున్నారు.