IBomma Ravi: ఐ బొమ్మ రవి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
పైరసీ వెబ్ సైట్ నిర్వాహకుడు ఐ బొమ్మ రవి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటి వరకు అతనిపై ఐటీ, చట్టం, సినిమా పైరసీ లాంటి వాటితో పాటూ ఫారినర్స్ యాక్ట్ కూడా జోడించారు.
పైరసీ వెబ్ సైట్ నిర్వాహకుడు ఐ బొమ్మ రవి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటి వరకు అతనిపై ఐటీ, చట్టం, సినిమా పైరసీ లాంటి వాటితో పాటూ ఫారినర్స్ యాక్ట్ కూడా జోడించారు.
వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్య, పిల్లల్ని హత్య చేసిన కేసులో నిందితుడిని దోషిగా తేల్చింది. దీంతో అతడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ని ముట్టడించడానికి తెలంగాణ జాగృతి నేతలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కవితతోపాటు పలువురు జాగృతినేతల్ని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆత్మాహుతి దాడి గురించి ఉమర్ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఇస్లాంలో ఆత్మహత్య, అమాయకులను చంపడం రెండూ ఘోరమైన పాపమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు X వేదికగా పోస్టు పెట్టారు.
మాజీ ప్రధాని ఇందిరా జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు లాంఛనంగా ప్రారంభిస్తారు. మొదటి దశలో డిసెంబరు 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని కలిశారు. తలసారి శ్రీనివాస్ యాదవ్ తమ్ముడి కూతురినే నవీన్ యాదవ్ వివాహం చేసుకున్నారు.
పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఇద్దరు ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ దొరికిపోయారు. సర్వేయర్ రూ.1లక్ష లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. హైదరాబాద్–సికింద్రాబాద్ MRO ఆఫీస్‌లో సర్వేయర్, అతని సహచరుడు అవినీతికి పాల్పడ్డారు.
కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంగళవారం మంత్రి సీతక్కతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో వాట్సప్ మీ సేవ సర్వీసులను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇందులో 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కిపైగా సర్వీసులను వాట్సప్ ద్వారా పొందేలా మీసేవ ఏర్పాట్లు చేసింది. మెటా, మీ సేవ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.