మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ ఫైనల్ ఈయర్ చదువుతున్న విద్యార్ధి గుండెపోటుతో మరణించాడు. యువకుడు క్రికెట్ ఆడుతూ గ్రౌండ్‌లోనే మరణించాడు. ఫీల్డింగ్ చేస్తూ వినయ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. హాస్పిటల్‌కు తరలించే లోపే యువకుడు మృతి చెందాడు. కళ్లముందే ఫ్రెండ్ ప్రాణాలు కోల్పోవడంతో తోటివిద్యార్ధులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వినయ్ స్వస్థలం ఖమ్మం జిల్లా. చదువుకోడానికి హైదరాబాద్ వచ్చాడు. CMR ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఫైనల్ ఈయర్ చదువుతున్నాడు.
Also read: Viral: అర్థరాత్రి వంటగదిలోకి చొరబడిన సింహం.. వీడియో వైరల్ (VIDEO)
మిడ్ వికెట్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న వినయ్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. అది చూసి తోటి విద్యార్థులు కంగారు పడిపోయారు. చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించేలోపే వినయ్ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్నన వియన్ ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయింది. వినయ్ అకస్మాత్తుగా కిందపడటం అక్కడే ఉన్న సీసీకెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దీంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.