ORRపై లగ్జరీ కార్లతో స్టంట్లు.. పోలీసులకు పట్టించిన వైరల్ వీడియో

ఔటర్ రింగ్ రోడ్డుపై లగ్జరీ కార్లతో విన్యాసాలు చేసిన విద్యార్థులను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ అరెస్ట్ చేశారు. ఫార్చ్యూనర్, BMW కార్లతో ఓఆర్ఆర్ మధ్యలో స్టంట్స్ చేశారు. ఈ వీడియోలు వైరలై.. పోలీసుల కంట్లో పడింది. విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
ORR stants

ORR stants Photograph: (ORR stants)

ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై ఖరీదైన కార్లతో స్టంట్లు చేసిన స్టూడెంట్స్‌ను హైదరాబాద్‌ పోలీసులు (Hyderabad Police) అరెస్ట్ చేశారు. కొందరు విద్యార్థులు ఓఆర్ఆర్ మధ్యలో రాత్రి సమయంలో లగ్జరీ కార్లతో సర్కిల్స్ వేస్తూ స్టంట్లు చేశారు. ఫిబ్రవరి 9న ఐదు లేన్ల హైవేపై ఫార్చ్యూనర్, BMW కార్లు హ్యాండ్‌బ్రేక్ ఉపయోగించి విన్యాసాలు చేశారు. దాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read :  సీఎం సీటుపై మధు యష్కీ సంచలన వ్యాఖ్యలు

Students Car Stunts On Hyderabad ORR

అది కాస్త వైరలై సిటీ పోలీసుల కంట పడింది. పోలీసులు సీసీటీవీలో చెక్ చేసి కారు డ్రైవింగ్ చేసిన వారిని గుర్తించారు. శంషాబాద్‌లోని ORRపై రెండు వేర్వేరు కార్లలో విద్యార్థులు విన్యాసాలు చేశారు. ORRపై ఏర్పాటు చేసిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల్లో వారి వికృత చేష్ఠలు రికార్డ్ అయ్యాయి. విద్యార్థులు విన్యాసాలు చేస్తున్న వీడియో వైరల్‌గా మారిందని పోలీస్ అధికారి తెలిపారు.

Also Read :  IND vs PAK: భారత్ను చూసి బుద్దితెచ్చుకో .. టీమిండియా జెర్సీ పై పాకిస్తాన్ పేరు!

Also Read :  కిడ్నీ రాకెట్‌ దందాలో కీలక పరిణామం.. విదేశాలకు పారిపోయిన ప్రధాన నిందితుడు!

కార్లను గుర్తుపట్టకుండా ఉండటానికి యువకులు నంబర్ ప్లేట్లను తీసివేసారు. కానీ వారి ముఖాలు సీసీటీవీ కెమెరాలలో కనిపించాయని పోలీసులు తెలిపారు. ఆర్‌జిఐ విమానాశ్రయ పోలీసులు రాజేంద్రనగర్ నివాసి మహ్మద్ ఒబైదుల్లా (25), మలక్‌పేట నివాసి జోహైర్ సిద్ధిఖీ (25) లను గుర్తించి సోమవారం అరెస్టు చేశారు. ఫార్చ్యూనర్, BMW లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వ్యాలంటెన్స్ డే రోజు ఓ జంట రోడ్డుపై స్టంట్ చేయగా.. వారిపై టీజీ ఆర్టీసీ ఎండీ సర్జనార్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. 

Also Read :  ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ ఆ రూటులో ప్రయాణిస్తే 10 శాతం డిస్కౌంట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు