/rtv/media/media_files/2025/02/18/y2sxSr8YrtB92zss3HmU.jpg)
Hydra commissioner Ranganath
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో హైడ్రాకు స్పెషల్ పోలీస్‌స్టేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. హైడ్రాకు ప్రత్యేక పోర్టులు కూడా తీసుకురానున్నామని ఆయన మీడియాతో చెప్పారు. గతంలో కంటే 2025లో హైడ్రా యాక్టివ్‌గా పని చేస్తుందని అన్నారు.
చెరువుల FTL, బఫర్ జోన్లను పక్కాగా నిర్థారిస్తామని వివరించారు. వాటి గురించి ప్రజలందరీ తెలిసేలా ప్రచారం చేస్తామన్నారు. HMDA నిధులతో 6 చెరువులను అభివృద్ధి చేయబోతున్నామని అన్నారు. నాలాలు శుభ్రం చేయడానికి జర్మన్ టెక్నాలజీ వాడాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ భూముల కబ్జా, ఇసుక అక్రమ రవాణా , అక్రమ హోర్డింగ్ దందాలు అడ్డుకోడానికి ఫోకస్ పెట్టామని ఆయన చెప్పారు.
Also read: US airstrikes: అమెరికా వైమానిక దాడిలో 19 మంది మృతి!