పహల్గాం ఉగ్రవాద దాడి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో భారత్ - పాక్ మధ్య కొన్ని దౌత్య సంబంధాలు తెగిపోయాయి. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.
Also Read : మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!
హైదరాబాద్‌లో పాక్ యువకుడు
దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. ఈ మేరకు తాజాగా హైదరాబాద్ పోలీసులు ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు.
Also Read : ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!
ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
తెలంగాణ డీజీపీ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థానీలను వెంటనే వెనక్కి పంపాలన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. తెలంగాణలో పాకిస్థానీలందరూ వెంటనే భారత్ ను వీడాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 27వ తేదీతో వీసాలు రద్దవుతాయని, మెడికల్ వీసాదారులకు ఏప్రిల్ 29 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ 30 వరకు అటారి వాఘ బార్డర్ ఓపెన్ ఉంటుందని తెలిపారు.
Also Read : నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..
హైదరాబాద్ లో ఉన్న పాకిస్తానీయులపై నిఘా పెట్టామన్న డీజీపీ.. అక్రమంగా తెలంగాణలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా హైదరాబాద్ లో 208మంది పాకిస్థానీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులను భారత్ విడిచి వెళ్లిపోవాలని ఇటీవల కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కేంద్రం పాకిస్తానీల వీసాలు రద్దు చేసింది.
Also Read : బీచ్‌లో బుసలు కొడుతున్న సుప్రిత.. హాట్ అందాలకు కుర్రకారు ఫిదా
పాకిస్తానీయులపై పోలీసులు నజర్
హైదరాబాద్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై పోలీసులు నజర్ పెట్టారు. పాక్ పౌరుల వివరాలు సేకరించారు. 208 మంది పాకిస్తానీలు హైదరాబాద్‌లో ఉన్నటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరి మరో రెండు రోజుల్లోగా పాకిస్థాన్ వెళ్లిపోవాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. కేంద్ర ఇచ్చిన గడువు ముగుస్తోండటంతో అన్నిరాష్ట్రాలను కేంద్రహోంశాఖ అలెర్ట్ చేసింది. అదే విధంగా పాక్, ఇండియా ఉద్రిక్త పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన నగరాల్లో సెక్యురీటీ హై అలర్ట్ చేశారు.
latest-telugu-news | Pahalgam attack | Pahalgam Attack latest news