Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ పదోన్నతుల్లో లొల్లి.. ఔటా ఫిర్యాదు

ఉస్మానియా యూనివర్సిటీలోని సీనియర్‌ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయని వెల్లడైంది. ఇదే అంశంపై ఉస్మానియా టీచర్స్‌ అసోసియేషన్‌ (ఔటా) ప్రతినిధులు చేసిన కంప్లైంట్స్ పై  యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) రియాక్ట్ అయింది.

New Update
ou professors

ou professors Photograph: (ou professors)

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలోని సీనియర్‌ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయని వెల్లడైంది. ఇదే అంశంపై ఉస్మానియా టీచర్స్‌ అసోసియేషన్‌ (ఔటా) ప్రతినిధులు చేసిన కంప్లైంట్స్ పై  యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) రియాక్ట్ అయింది.  రూల్స్ ప్రకారం సీనియర్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందాలంటే ప్రొఫెసర్‌గా పదేళ్ల అనుభవం ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా వారు రూపొందించిన 10 పరిశోధన పత్రాలు యూజీసీ కేర్‌ జాబితాలోని జర్నళ్లలో ప్రచురితం కావాల్సి ఉంటుంది. 

Also Read :   సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!

అయితే మాజీ  వీసీ ప్రొఫెసర్‌ బి.రవీందర్‌, ప్రొఫెసర్‌ ఎ.బాలకృష్ణ సమర్పించిన పరిశోధన పత్రాలు ప్రచురితం కాలేదని యూజీసీ నిర్ధారించింది. బి.రవీందర్‌ 10 పరిశోధన పత్రాల్లో 5, బాలకృష్ణ  10 పరిశోధన పత్రాల్లో 8 యూజీసీ కేర్‌ జర్నళ్లలో ప్రచురితం కాలేదని స్పష్టం చేసింది.  రూల్స్ బ్రేక్ చేసిన వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.  

Also Read :  Champions Trophy 2025: చెలరేగిన టీమిండియా.. ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా భారత్

ఉస్మానియా యూనివర్సిటీలోని సీనియర్‌ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయంటూ ఏడాది కిందే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల్లో  20 మందికి పైగా ప్రొఫెసర్లపై ఆరోపణలు చేశారు. దీంతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ గత మార్చిలోనే నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  

Also Read : OTT Movies: ఓటీటీలో మిలియన్ల జనం చూసిన సీరీస్ లు, సినిమాలు ఇవే.. మరి మీరు చూశారా?

ప్రొఫెసర్‌ బి.రవీందర్‌ రియాక్షన్ ఇదే 

ఉస్మానియా టీచర్స్‌ అసోసియేషన్‌ చేసిన ఆరోపణలపై  ఓయూ మాజీ వీసీ, ప్రొఫెసర్‌ బి.రవీందర్‌  స్పందించారు.  యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌-2018 నిబంధనల ప్రకారమే తన పరిశోధన పత్రాలు యూజీసీ జర్నళ్లలో ప్రచురితమయ్యాయని చెప్పుకొచ్చారు.  యూజీసీ-కేర్‌ జర్నళ్లు అనేవి లేవని, తన పరిశోధన పత్రాలు అన్ని  యూజీసీ పీర్‌ జర్నళ్లలో ప్రచురితమయ్యాయని వెల్లడించారు.  

Also Read :  Stock Market Today: లాభాల్లో  ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు